Prashant Bhushan: ఆప్ ముగింపునకు ఇది ఆరంభం.. కేజ్రీవాల్‌ను ఏకిపారేసిన ప్రశాంత్ భూషణ్

ABN, Publish Date - Feb 09 , 2025 | 07:07 PM

ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా పారదర్శకతతో పాలించలో విఫలమైందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. 2015లో ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ నుంచి 'ఆప్' బహిష్కరించింది.

Prashant Bhushan: ఆప్ ముగింపునకు ఇది ఆరంభం.. కేజ్రీవాల్‌ను ఏకిపారేసిన ప్రశాంత్ భూషణ్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర ఓటమికి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కారణమని, ఇది ''పార్టీ ముగింపునకు ఆరంభం'' (begining of the end) అని ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) అన్నారు. ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో ఆ పార్టీ మూల సిద్ధాంతాలకు కేజ్రీవాల్ తిలోదకాలు ఇచ్చారని, అవినీతి సంస్థగా పార్టీని మార్చారని దుయ్యబట్టారు. ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు. 2015లో ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ నుంచి 'ఆప్' బహిష్కరించింది.

Delhi: ఎల్జీ అపాయింట్‌మెంట్ కోరిన బీజేపీ


''ఆమ్ ఆద్మీ పార్టీ సహజ స్వభావాన్ని కోల్పోయింది. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో పార్టీ స్థాపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకతతో పాలించడంలో పూర్తిగా విఫలమైంది. లోక్‌పాల్ సిద్ధాంతాలతో రాజకీయ ప్రవేశం చేసి ఇప్పుడు సొంత లోక్‌పాల్‌ను సృష్టించుకుంది. అవినీతి పార్టీగా ముద్రవేయించుకుంది" అని ప్రశాంత్ భూషణ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు.


కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 'శీష్ మహల్' కట్టుకున్నారంటూ చెలరేగిన వివాదాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో ఇది ప్రధాన ప్రచార ఆస్త్రంగా మారిందన్నారు. ''ఆయన తన కోసం రూ.45 కోట్లతో శీష్ మహల్ కట్టుకున్నారు. లగ్జరీ కార్లలో తిరగడం మొదలుపెట్టారు. ఆప్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించిన 33 సమగ్ర పాలసీ నివేదికలను చెత్తబుట్టలో పడేశారు'' అని భూషణ్ ఆరోపించారు. చిత్తశుద్ధితో పాలన అందించడానికి బదులుగా ప్రచారార్భాటాలకు పరిమితమయ్యారని అన్నారు. ఇది ఆప్ ముగింపునకు ప్రారంభమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


దీనికి ముందు, ఆప్ ఎన్నికల పరాజయంపై ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నాహజారే సైతం కేజ్రీవాల్‌ను తప్పుపట్టారు. 'ఆప్' ఇమేజ్‌ను కేజ్రీవాల్ డ్యామేజ్ చేశారని, ఆప్ ఓటమికి కారణమయ్యారని తప్పుపట్టారు. జీవితాంతం చిన్నచిన్న గదుల్లో నివసిస్తారని కేజ్రీవాల్ ప్రకటించుకున్నారని, అయితే ఆ తర్వాత శీష్‌మహల్ కట్టారని తాను విన్నానని అన్నారు. 90 ఏళ్ల వయస్సులో తాను కూడా ఒక ఫ్యాన్సీ హౌస్ కట్టుకోవచ్చని, అయితే లగ్జరీలో సంతోషం లేదని, సమాజానికి మంచి పనులు చేయడంలోనే సంతోషం ఉందని చెప్పారు. ప్రజాసేవ కంటే డబ్బుకే ఆప్ ప్రాధానం ఇవ్వడంతో విశ్వసనీయత కోల్పోయి చివరకు ఓటమిపాలైందని విశ్లేషించారు. శనివారంనాడు ప్రకటించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 62 స్థానాల నుంచి 22 స్థానాలకు పడిపోయింది. అప్పట్లో 8 సీటు మాత్రమే గెలిచిన బీజేపీ 48 సీట్లు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలు పలువురు చిత్తుగా ఓడిపోయారు.


ఇవి కూడా చదవండి..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 08:39 PM