Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 09:39 AM
Prashant Kishor Arrest: బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాల్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించారు.
చెప్పినా వినకపోవడంతో..
బీపీఎస్‌సీ వ్యవహారంలో దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో పాటు ఆయన 150 మంది మద్దతుదారుల మీద పాట్నా పోలీసులు అంతకుముందు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన ఆందోళన అని అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గర్దానీ బాగ్‌లో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. కానీ గాంధీ మైదాన్‌లోనే నిరసనకు దిగారు ప్రశాంత్ కిషోర్. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.