ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prashant Kishore: నిరాహార దీక్ష విరమించనున్న పీకే.. కీలక ప్రకటనకు సిద్ధం

ABN, Publish Date - Jan 15 , 2025 | 04:57 PM

గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నారని, ఉద్యమం తదుపరి దశను కూాడా ప్రకటిస్తారని జన్ సురాజ్ వర్గాలు తెలిపాయి.

పాట్నా: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై 14 రోజులుగా నిరాహార దీక్ష సాగిస్తున్న జన్ సురాజ్ (Jan Suraaj) చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించనున్నారు. గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై భారత్‌కు క్షమాపణ చెప్పిన మెటా


''యువత, జన్ సురాజ్ ఫ్యామిలీ విజ్ఞప్తిని గౌరవిస్తూ ప్రశాంత్ కిషోర్ తమ దీక్షను గురువారంనాడు విరమించనున్నారు. బీహార్‌లో విద్యావ్యవస్థ కుప్పకూలడం, పరీక్షల నిర్వహణలో అవినీతికి నిరసగా ఆయన దీక్ష చేపట్టారు. దీక్ష విరమణతో పాటు ఉద్యమం తదుపరి దశ గురించి ఆయన ప్రకటన చేస్తారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, సత్యాగ్రహ ఉద్యమానికి బలం చేకూర్చాలని కోరుతున్నాం'' అని జన్ సురాజ్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.


గవర్నర్ చొరవ

దీనికి ముందు, ప్రశాంత్ కిషోర్ తమ దీక్షను విరమించాలని బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కోరారు. సమస్య పరిష్కారం కోసం చర్చించేందుకు ఒక విద్యార్థి ప్రతినిధిని పంపాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. తనకున్న అధికారాన్ని వినియోగించిన సమస్య పరిషర్కానికి చేయగలిగినంత చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు విద్యార్థి నేతలు తెలిపారు.


బీపీఎస్‌సీ లీగల్ నోటీసులు జారీ

మరోవైపు, ప్రశాంత్ కిషోర్ సహా పలువురికి బీపీఎస్‌సీ లీగల్ నోటీసులు పంపింది. రాష్ట్రంలో డిసెంబర్ 13న సీసీఈ నిర్వహించిన పరీక్షలపై కమిషన్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు వెళ్లాయి. బీపీఎస్‌సీకి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేసినందుకు పలువురు రాజకీయ నేతలు, కోచింగ్ సెంటర్స్‌తో అసోసియేషన్ ఉన్న వ్యక్తులకు నోటీసులు పంపామని, త్వరలో మరిన్ని నోటీసులు పంపుతామని బీపీఎస్‌సీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు,


ఇవి కూడా చదవండి..

Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..

Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 15 , 2025 | 05:00 PM