Robert Vadra: ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. ఆ స్కామ్‌లో అరెస్ట్ చేస్తారా..
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:36 AM
ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయగా.. గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం నాడు రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు రూ. 7.5 కోట్ల విలువైన భూముల వ్యవహారంలో వాద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయగా.. గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం నాడు రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. గుర్గావ్ ల్యాండ్ స్కామ్, భూసేకరణ లావాదేవీల కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణకు వెళ్తున్న సమయంలో రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాజకీయ ప్రతికారంలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తాను ప్రజా గొంతుక వినిపించినప్పుడల్లా బీజేపీ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని.. ఈడీ అధికారులు ఏం అడిగినా సమాధానం చెబుతానని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా.. హర్యానాలో జరిగిన భూ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ల్యాండ్ స్కామ్, మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఏప్రిల్ 8న నోటీసులు జారీ చేశార. కానీ, అప్పుడు ఆయన డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు విచారణకు హాజరయ్యారు.
గతంలో మరో మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ ప్రశ్నించింది. తాజా కేసు ఫిబ్రవరి 2008లో వాద్రాకు చెందిన స్కెలైట్ హాస్పటల్ కోసం రూ. 7. కోట్లకు భూమి కొనుగోలుకు సంబధించినది. సాధారణంగా నెలలు పట్టే ఈ మ్యుటేషన్ ప్రక్రియ కేవలం ఒక్క రోజులోనే పూర్తవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే, కొంతకాలం తరువాత.. ఆ భూమిలో హౌసింగ సొసైటీని అభివృద్ధి చేయడానికి అనుమతి లభించింది. ఆ సమయంలో ప్లాట్స్ ధర కూడా భారీగా పెరిగింది. అదే సంవత్సరం జూన్‌లో సదరు భూమిని డీఎల్‌ఎఫ్‌కి రూ. 58 కోట్లకు విక్రయించారు. ఈ వ్యవహారంపైనే ఈడీ సీరియస్‌గా దృష్టి పెట్టింది.
Also Read:
సైఫ్ అలీఖాన్ కేసులో భారీ ట్విస్ట్
హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం
ఇంట్లో ఈ కలర్ వస్తువులు ఎక్కువగా ఉంటే నష్టాలే..
For More National News and Telugu News..