Mehul Choksi Arrest: రూ. 13, 500 కోట్లు మోసం చేసిన మెహుల్ ఛోక్సీ.. ఎట్టకేలకు అరెస్ట్..
ABN , Publish Date - Apr 14 , 2025 | 09:22 AM
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఎట్టకేలకు బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం బెల్జియం జైలులో ఉన్నాడు.

Mehul Choksi Arrest: డైమండ్ వ్యాపారి మెహుల్ ఛోక్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన చాలా ఫేమస్. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు చెప్పగానే ముందుగా గుర్తించేది ఆయనే. ఎందుకంటే, ఆయన ఆ రేంజ్‌లో బ్యాంకుని మోసం చేసి ఎస్కేప్ అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 13, 500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు చెక్కేసాడు.
అయితే, ఈ నిందితుడిపై భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అతడిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలనే ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారుల కోరిక మేరకు మెహుల్ ఛోక్సీని ఎట్టకేలకు బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు బెల్జియం జైలులో ఉన్నాడు. మెహుల్ ఛోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో అతడిని తమకు అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ ప్రభుత్వం కోరింది. అయితే, అక్కడి చట్టాల ప్రకారం మెహుల్ ఛోక్సీ భారత్‌కు వస్తాడా? లేదంటే అక్కడే న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే?
2018 జనవరిలో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు ఇద్దరూ విదేశాలకు పారిపోయారు. రూ. 13, 500 వేల కోట్లతోొ భారత్ నుంచి పారిపోయిన మెహుల్ ఛోక్సీ బెల్జియంలో సెటిలయ్యారు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు కావడంతో అక్కడ ఉండటానికి ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 65 ఏళ్ల మెహుల్ చోక్సీ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛోక్సీ ఇండియాకు వస్తే ఎలాంటి ఫలితం ఉండదని, ఆయన ఆరోగ్యానికి మనమే ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌కు ఎగ్గొట్టిన 13 వేల కోట్ల రూపాయలను రాబడితే చాలు అని అంటున్నారు.
కాగా, ఇదే కేసులో మరో నిందితుడు అయిన చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడిని కూడా తిరిగి భారత్ రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Also Read:
Nitin Gadkari: హైవేల బలోపేతానికి 10 లక్షల కోట్లు
లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.
SC Sub-Categorization: ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే..