Share News

Rahul Gandhi: చరిత్రను తుడిచేసే యత్నం

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:00 AM

చరిత్రను తుడిచిపెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) నిరంతరం ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.

Rahul Gandhi: చరిత్రను తుడిచేసే యత్నం

  • భాషపై ఆర్‌ఎ్‌సఎస్‌ దాడి

  • రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌ ధ్వజం

  • యూజీసీ ముసాయిదా నిబంధనలపై ఆగ్రహం

  • జంతర్‌మంతర్‌ వద్ద డీఎంకే నిరసనకు హాజరు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: చరిత్రను తుడిచిపెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) నిరంతరం ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. నియామక, పదోన్నతులకు సంబంధించి యూ నివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) రూ పొందించిన ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం గురువారమిక్కడ జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన నిరసనలో వారిద్దరూ పాల్గొన్నారు. ‘ఈ దేశంలోని అన్ని చరిత్రలు, సంస్కృతులు, సంప్రదాయాలను నిర్మూలించడమే ఆర్‌ఎ్‌సఎస్‌ లక్ష్యమని కొద్దికాలంగా నేను చెబుతూ వస్తున్నాను. రాజ్యాంగంపై వారు దాడిచేస్తున్నారు. దేశం మీద ఒకటే చరిత్ర, ఒకటే సంప్రదాయం, ఒకే భాష, ఆలోచనను రుద్దాలని అనుకుంటున్నారు.


తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి విద్యావ్యవస్థ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ ప్రజలకు నిర్దిష్ట చరిత్ర, భాష, సంప్రదాయాలు ఉన్నాయి. పోరాటాల చరిత్ర కూడా ఉంది. యూజీసీ నిబంధనలు మార్చడం ద్వారా ఆర్‌ఎ్‌సఎస్‌ తన ఆధిపత్యాన్ని రుద్దాలనుకోవడం.. వారిని, ఇతర రాష్ట్రాలను అవమానించడమే’ అని అన్నారు. జాతీయ విద్యావిధానాని(ఎన్‌ఈపీ)కి తాను వ్యతిరేకమని అఖిలేశ్‌ స్పష్టంచేశారు. రాష్ట్రప్రభుత్వాల అధికారాలన్నీ లాక్కోవాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. కాగా, ప్రగతిశీల విద్యానిబంధనలను ప్రతిపక్షాలు వక్రీకరించి.. లేనిపోని ము ప్పును ఊహిస్తున్నాయని కేంద్ర విద్యామం త్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విమర్శించారు. యూజీసీ ముసాయిదా నిబంధనలు,హద్దులను విస్తృతం చేయడానికే తప్ప కుదించడానికి కాదన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 05:01 AM