ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గుడ్ న్యూస్.. బెయిల్ మంజూరు

ABN, Publish Date - Jan 10 , 2025 | 07:28 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పూణే కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. పరువు నష్టం కేసులో పూణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీపై ఈ పరువు నష్టం కేసును విడి సావర్కర్ మనవడు దాఖలు చేశారు.

Rahul Gandhi

హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi )కి ఊరట లభించింది. ఈ క్రమంలో పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన తర్వాత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌కు రూ.25,000 పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ జోషి కోర్టులో పూచీకత్తుగా హాజరయ్యారు.


కాంగ్రెస్ నాయకుడికి కోర్టు ముందు హాజరు కావడానికి శాశ్వత మినహాయింపు ఇచ్చిందని గాంధీ తరపున వాదించిన న్యాయవాది మిలింద్ పవార్ అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 18న జరుగుతుందని పవార్ తెలిపారు. సావర్కర్ మనవడు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. మార్చి 2023లో లండన్‌లో గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించినది. రాహుల్ తన ప్రసంగంలో స్వాతంత్ర్య సమరయోధుడు రాసిన పుస్తకం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.


సావర్కర్ గురించి

గత సంవత్సరం ప్రారంభంలో లండన్‌లో జరిగిన ప్రసంగంలో దివంగత స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి రాహుల్ గాంధీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. రాహుల్ తన ప్రసంగంలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టిన సంఘటన గురించి VD సావర్కర్ ఒక పుస్తకంలో రాశారని, సావర్కర్ దాని గురించి "సంతోషంగా" ఉన్నట్లుగా చెప్పారని ఆరోపించారు. దీనిపై సావర్కర్ మనమడు సత్యకి సావర్కర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వాటిని "కల్పితమని, దురుద్దేశంతో కూడినవని అన్నారు. అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, VD సావర్కర్ ఎప్పుడూ ఇలా ఏమీ రాయలేదని ఆయన నొక్కి చెప్పారు.


ఫిర్యాదు నేపథ్యంలో..

గాంధీ చేసిన ప్రకటనలు తన ముత్తాత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని సావర్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు తర్వాత, పూణే కోర్టు ఈ విషయంపై దర్యాప్తు చేయాలని విశ్రామ్‌బాగ్ పోలీసులను ఆదేశించింది. విచారణ నిర్వహించి, పరువు నష్టం ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తేల్చింది. మునుపటి విచారణలో గాంధీ తరపు న్యాయవాది డిసెంబర్ 3న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నందున హాజరుకాకుండా మినహాయింపు కోరారు. కోర్టు మినహాయింపు మంజూరు చేసింది. కానీ జనవరి 10న జరగనున్న తదుపరి విచారణకు గాంధీ హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి:

Stock Market: వారాంతంలో కూడా భారీ నష్టాలు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి..

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 10 , 2025 | 07:42 PM