Ramesh Bidhuri: బీజేపీ సీఎం అభ్యర్థిత్వంపై కేజ్రీ వ్యాఖ్యలకు బిధూరి కౌంటర్
ABN, Publish Date - Jan 12 , 2025 | 05:44 PM
కేజ్రీవాల్ మాయలో ఢిల్లీ ప్రజలు చిక్కుకోవద్దని బిధూరి సూచించారు. ఢిల్లీ ప్రజల కోసం అంకితమైన బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ అంటే తనకు ఎంత అంకితభావం ఉందో ప్రజల పట్ల కూడా అంతే అంకితభావం ఉందని చెప్పారు.
న్యూఢిల్లీ: బీజేపీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసిందంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్పడాన్ని ఆ పార్టీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి (Ramesh Bidhuri) తోసిపుచ్చారు. తనపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారంటూ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. ఏ పదవికి తాను హక్కుదారుని కాదని, పార్టీకి విధేయ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు.
Delhi Elections 2025: నిరుద్యోగ యువతకు రూ.8,500
''పార్టీ నాకెంతో ఇచ్చింది. ఏ పదవిని నేను కోరడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ నిరంతరం నాపై తప్పుడు ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. నా వైపు నుంచి ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం చూస్తే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన అంగీకరించినట్ట అర్ధమవుతోంది. తన ఓటమిని కూడా ఆయన అంగీకరించారనే అనుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఆయనపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. లిక్కర్ కుంభకోణం, విద్యా కుంభకోణం, హెల్త్ స్కామ్, శీషమహల్ స్కామ్, రోడ్ల దుస్థితి, కలుషిత మంచి నీటి దుస్థితి నుంచి విముక్తి పొందాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు'' అని బిధూరి ఒక ప్రకటనలో తెలిపారు.
బీజేపీకి అధికారమివ్వండి
కేజ్రీవాల్ మాయలో ఢిల్లీ ప్రజలు చిక్కుకోవద్దని బిధూరి సూచించారు. ఢిల్లీ ప్రజల కోసం అంకితమైన బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ అంటే తనకు ఎంత అంకితభావం ఉందో ప్రజల పట్ల కూడా అంతే అంకితభావం ఉందని, ముఖ్యమంత్రి పదవి తనకేనడం పూర్తిగా నిరాధారమని ఆయన వివరించారు. బీజేపీకి విధేయ సేవకుడిగానే కొనసాగుతానని చెప్పారు. దీనికి ముందు, బీజేపీ సీఎం అభ్యర్థిగా రమేష్ బిధూరిని ఎంపిక చేసినట్టు తనకు ఆ పార్టీ వర్గాల నుంచే తెలిసిందని, ఒకటి రెండు రోజుల్లో బిధూరి సీఎం అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ప్రకటించనుందని కేజ్రీవాల్ తెలిపారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ఆక్షేపణ తెలిపారు. మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఆయన (కేజ్రీవాల్) చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు
Read Latest National News and Telugu News
Updated Date - Jan 12 , 2025 | 05:44 PM