Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
ABN , Publish Date - Jan 24 , 2025 | 01:02 PM
మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఆమోదం తెలిపారు.

- చట్టసవరణ బిల్లుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
చెన్నై: మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఆమోదం తెలిపారు. ఈ బిల్లు కంటే ముందు శాసనసభలో గతంలో ఆమోదించి పంపిన సుమారు పదిబిల్లుల్ని మాత్రం పక్కనబెట్టి, ఈ బిల్లు మాత్రం అంగీకరించడం గమనార్హం. కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చిన రెండు చట్టాలకు సంబంధించిన సవరణలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది.
ఈ వార్తను కూడా చదవండి: Gali Janardhan Reddy: ‘గాలి’ సంచలన కామెంట్స్.. శ్రీరాములు ఓ నమ్మక ద్రోహి..
మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, సామూహిక అత్యాచారాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో అమలులోకి తెచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్‌ఎస్ఎస్) చట్టాలను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సవరణ చేసి ముసాయిదా చట్టాన్ని హోంశాఖ కూడా నిర్వహి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఈ నెల 10న శాసనసభలో ప్రవేశపెట్టారు.
ఈ ముసాయిదా చట్టాన్ని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ముసాయిదా చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపినట్లు రాజ్‌భవన్ నుండి ప్రకటన వడుదలైంది. ఈ కొత్త చట్టం ప్రకారం బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష, 12 యేళ్ళలోపు బాలికలపై లైంగిక వేదింపులకు పాల్పడితే యావజ్జీవకారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధిస్తారు. 18 యేళ్ళలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడితే జీవితకారాగార శిక్ష లేదా ఉరిశిక్ష అమలు చేస్తారు.
అత్యాచార కేసుల్లో బాధిత మహిళల వివరాలను బహిర్గతం చేస్తే మూడేళ్లు లేదా ఐదేళ్ళ జైలుశిక్ష, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే మూడు నుంచి ఐదేళ్ళవరకు కఠిన కారాగార శిక్ష విధించనున్నారు. యాసిడ్ దాడి వంటి కేసుల్లో పదేళ్ళ జైలు శిక్ష విధించనున్నారు. గవర్నర్ ఆమోదం తెలుపటంతో ఈ కొత్త చట్టం గురువారం నుండే రాష్ట్రమంతటా అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?
ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!
Read Latest Telangana News and National News