Ratan Tata Legacy: దానధర్మాలకు 3800 కోట్లు
ABN, Publish Date - Apr 02 , 2025 | 04:54 AM
రతన్ టాటా తన చివరి వీలునామాలో రూ.3,800 కోట్లను సామాజిక సేవలకు కేటాయించారు. టాటా సన్స్‌లోని 70% వాటాలు తన ఏర్పాటు చేసిన ఎండోమెంట్ ఫౌండేషన్‌కు, మిగిలిన వాటాలు ట్రస్ట్‌కు వెళ్ళిపోతాయని ప్రకటించారు

వీలునామాలో రాసిచ్చిన రతన్ టాటా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగం సామాజిక సేవకు, దానధర్మాలకు కేటాయించారు. తన మొత్తం సంపదలో రూ.3,800 కోట్లను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్(ఆర్‌టీఈఎఫ్), రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ (ఆర్‌టీఈటీ)కు కేటాయించారు. టాటా సన్స్‌లో రతన్ టాటాకు ఉన్న వాటాలో 70% ఆర్‌టీఈఎఫ్‌కు, మిగిలిన 30% ఆర్‌టీఈటీకి వెళ్తుంది. 2022 ఫిబ్రవరి 23న టాటా గ్రూప్ అధినేత తన చివరి వీలునామాను సిద్ధం చేశారు. టాటా సన్స్‌లో తన వాటాలను ప్రస్తుత వాటాదారుకు తప్ప వేరొకరికి బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి వీల్లేదని తన చివరి వీలునామాలో రతన్ టాటా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాచీలు, పెయింటింగ్‌లతో పాటు ఇతర ఆస్తుల్లో మూడోవంతును తన ఇద్దరు సవతి సోదరీమణులు షిరీన్ జెబోభోయ్, దీనా జెబోభోయ్ పేరున రాశారు. వాటి విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఉద్యోగి మోహినీ ఎం దత్తా పేరు కూడా వీలునామాలో ప్రస్తావించారు. టాటా, టాటాయేతర కంపెనీలు, గృహాల్లో వాటాలను మినహాయించి, మిగిలిన ఆస్తుల్లో మూడో వంతు వాటాను దత్తా అందుకోనున్నారు. ఆభరణాలతో పాటు తండ్రి నావల్ టాటా నుంచి వారసత్వంగా వచ్చిన జుహూ బంగ్లాలో సగం యాజమాన్య హక్కులను జిమ్మీ టాటా(సోదరుడు) సొంతం చేసుకుంటారు. కాగా, టాటా చివరి వీలునామా ప్రామాణికతను ధ్రువీకరించి, అందులో పేర్కొన్న విధంగా ఆస్తి నిర్వహణకు అనుమతులు కోరుతూ బాంబే హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలైంది.
ఇవి కూడా చదవండి..
Ranveer Allahbadia: రెండు వారాల తర్వాతే.. అల్హాబాదియా పాస్‌పోర్ట్ రిలీజ్‌పై సుప్రీంకోర్టు
Pryagraj Demolitions: ప్రయాగ్‌రాజ్ బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం ఆగ్రహం.. నష్టపరిహారానికి ఆదేశం
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
For National News And Telugu News
Updated Date - Apr 02 , 2025 | 04:54 AM