Holidays: ఈ ఏడాది సెలవులు ఎప్పుడెప్పుడంటే.. ఆ నెలలో ఉద్యోగస్తులకు బంపర్ బొనంజా
ABN, Publish Date - Jan 01 , 2025 | 12:32 PM
బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ ఏడాది బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు శుభవార్తే అని చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం బ్యాంకులకు పెద్ద సంఖ్యలో సెలవులు ఉండనున్నాయి. బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి. బ్యాంకులకు సెలవులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఖాతాదారులు ఆ విషయాన్ని గ్రహించి తమ అవసరాలకు డబ్బుల డ్రా విషయంలో సెలవులకు ముందుగానే బ్యాంకులకు వెళ్లడం బెటర్. ఈ ఏడాది జనవరి 1 నూతన సంవత్సరంతో బ్యాంకులకు సెలవు మొదలవగా.. డిసెంబర్‌లో 13 రోజుల పాటు సెలవులతో ఈ ఏడాది సెలవులు ముగియనున్నాయి. ప్రధానంగా ఈ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో మాత్రం ఎక్కువ రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ వచ్చాయి. మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇంకా రెండో శనివారాలు, ఆదివారాలు అదనం. ఈ ఏడాది 12 నెలల్లో ఏ ఏ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు సెలవుల కారణంగా మూసివేయబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి:
న్యూఇయర్ సందర్భంగా జనవరి 1 సెలవు ఉండగా.. జనవరి 2న కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ నెలలో 6, 11, 14, 15, 16, 23 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా రెండో శనివారం, ఆధివారం కూడా సెలవులు ఉంటాయి.
ఫిబ్రవరి:
ఫిబ్రవరిలో శని, ఆదివారాలు మినహా మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఫిబ్రవరి నెలలో 3, 11, 12, 15, 19, 20, 26, 28 తేదీల్లో సెలవులు ఉంటాయి.
మార్చి:
ఈనెలలో మొత్తం ఎనిమిది రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్. వాటిలో శని, ఆదివారాలు అదనం. మార్చి నెలలో 7, 13, 14, 15, 22, 27, 28, 31 తేదీల్లో సెలవులు ఉంటాయి.
ఏప్రిల్:
మొత్తం 10 రోజుల పాటు ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇవి కాగ అదనంగా శని, ఆదివారాలు కూడా సెలవులు ఉన్నాయి. ఏప్రిల్‌లో 1, 5, 10, 14, 15, 16, 18, 21, 29, 30 తేదీల్లో బ్యాంకులు మూతబడనున్నాయి.
మే:
ఈ ఏడాది మేలో ఆరు రోజుల పాటు బ్యాంకులకు హాలీడేస్. మే నెలలో 1, 9, 12, 16, 26, 29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
జూలై:
జూలై మాసంలో శని, ఆదివారాలు మినహా మొత్తం 6 రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్. జూలైలో 3, 5, 14, 17, 19, 28వ తేదీల్లో బ్యాంకులు మూతబడనున్నాయి.
ఆగస్టు:
ఈ మాసంలో శని, ఆదివారాలు మినహా మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. జూలైలో 8, 9, 13, 15, 16, 19, 25, 27, 28 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
సెప్టెంబర్:
సెప్టెంబర్‌లో శని, ఆదివారాలు మినహా మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. సెప్టెంబర్ 3, 4, 5, 6, 12, 22, 23, 29, 30 తేదీలలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
అక్టోబర్:
ఈ ఏడాది అన్ని మాసాలతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఎక్కువగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తాయి. 1, 2, 3, 4, 6, 7, 10, 18, 20, 21, 22, 23, 27, 28, 31 తేదీల్లో సెలవులు ఉంటాయి.
నవంబర్:
నవంబర్‌లో శని, ఆదివారాలు మినహా మొత్తం 4 రోజుల పాటు బ్యాంకులకు హాలీడేస్. నవంబర్ నెలలో 1, 5, 7, 8 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
డిసెంబర్:
ఈ మాసంలో13 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తాయి. అలాగే శని, ఆదివారాలు అదనం. డిసెంబర్‌లో 1, 3, 12, 18, 19, 20, 22, 24, 25, 26, 27, 30, 31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
కాగా.. బ్యాంకులకు సెలవులు అంటే దాన్ని పబ్లిక్ హాలిడేగా పరిగణిస్తారు. దీంతో బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు పాఠశాలలకు కూడా సెలవులు ఉండటం కామన్. సో.. ఈ ఏడాది విద్యార్థులకు ఎక్కువగా సెలవులు రావడం బంపరాఫరే అని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదాలు..
వామ్మో.. కిలో మల్లెపూలు రూ.4,200...
Read Latest National News And Telugu news
Updated Date - Jan 01 , 2025 | 01:00 PM