RG Kar case: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:09 PM
కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని పోస్ట్ గ్రాడ్యుయేష్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో స్థానిక సిల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు RG Kar case: సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. చనిపోయేంత వరకు అతడు జైల్లోనే ఉంచాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

కోల్‌కతా, జనవరి 20: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు సిల్దా కోర్టు శిక్ష ఖరారు చేసింది. అతడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అతడు మరణించే వరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అలాగే సంజయ్‌రాయ్‌కు రూ.50 వేల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ మేరకు సిల్దా కోర్టు సోమవారం తన తీర్పును వెలువరించింది. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్ జీ కర్ ఆసుపత్రిలో విధులకు హాజరైన ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.
ఆ మరునాడే..ఆగస్టు 10వ తేదీన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై భారత న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. అందులోభాగంగా మొత్తం120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. దీంతో భారత న్యాయసంహిత చట్టంలోని సెక్షన్లు 64, 66,103/1 కింద సంజయ్‌కు జీవిత ఖైదు విధించింది. ఇక బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సీల్దా కోర్టు ఆదేశించింది.
ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులంతా ఆందోళనకు దిగారు. ఇక పశ్చిమ బెంగాల్ వైద్యులు అయితే.. తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ఆ క్రమంలో వైద్య సేవలు సైతం నిలిచిపోయాయి. దీంతో వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కానీ వైద్యులు.. తమ డిమాండ్లను మమతా బెనర్జీ ముందు ఉంచారు.
కానీ వాటిలో కొన్నింటింని మాత్రమే ఆమె ఒప్పుకున్నారు. అనంతరం ప్రభుత్వం దిగి వచ్చి.. వైద్యులతో చర్చలు జరిపింది. అందుకు న్యాయం చేస్తామని.. అందుకు కొంత గడువు కొరింది. దీంతో వైద్యులు సానుకూలంగా స్పందించారు. కానీ ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చక పోవడంతో.. వైద్యులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. మరోవైపు అత్యవసర సేవలకు ఎటువంటి అటంకం కలిగించమని వైద్యులు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.
ఇక ఈ హత్యాచార ఘటనపై ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సందీప్ ఘోష్ వెంటనే స్పందించారు. ఈ హత్యాచార ఘటనను ఆయన ఖండించారు. మృతురాలు తన కుమార్తెతో సమానమన్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆ కొద్ది రోజులకే ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆయితే ఆ వెంటనే ఆయన్ని మరో మెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమించింది.
ఇక ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో సందీప్ ఘోష్ పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకొని.. ఆయనను విధుల నుంచి తప్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే. ఇక ఇదే తనను బలి పశువును చేశారంటూ నిందితుడు సంజయ్ రాయ్.. కోర్టుకు విన్నవించుకొన్నాడు. అంతేకాదు.. విధులకు హాజరైన ట్రైయినీ వైద్యురాలు.. రాత్రి 11.00 గంటల సమయంలో సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకొనేందుకు వెళ్లింది. ఆ ఉదయానికి ఆమె హత్యాచారానికి గురై విగత జీవిగా మారింది. అయితే సెమినార్ హాల్‌లో సీసీ టీవీ కెమెరాలు లేకపోవడం గమానార్హం.
For National News And Telugu News