Share News

Robert Vadra: కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా

ABN , Publish Date - Apr 14 , 2025 | 09:37 PM

గాంధీ కుటుంబంలో తాను సభ్యుడిని కావడం వల్లే ప్రతిసారి తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని వాద్రా ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తన పేరు ఆ పార్టీలకు గుర్తు వస్తుందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిందన్నారు.

Robert Vadra: కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ ప్రవేశం తర్వాత ఇప్పుడు ఆమె భర్త రాబర్డ్ వాద్రా (Robert Vadra) రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఉండాలని పార్టీ భావిస్తే కుటుంబ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి అడుగుపెడతానని చెప్పారు.

Priyanka: ప్రియాంక గాంధీకి పదోన్నతి..కాంగ్రెస్ కసరత్తు


గాంధీ కుటుంబంలో తాను సభ్యుడిని కావడం వల్లే ప్రతిసారి తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని వాద్రా ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తన పేరు ఆ పార్టీలకు గుర్తు వస్తుందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిగిందన్నారు.


''ప్రియాంక గాంధీ మొదట పార్లమెంటులో ఉండాలని ప్రతిసారి నేను చెబుతూ వచ్చాను. ఇప్పుడు ఆమె పార్లమెంటు సభ్యురాలు అయ్యారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె నుంచి, రాహుల్ నుంచి, కుటుంబంలోని ప్రతి ఒక్కరి నుంచి చాలా నేర్చుకున్నాను. కాంగ్రెస్ పార్టీ కోరితే కుటుంబ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వస్తాను. ప్రస్తుతం రాజకీయాలు ఏవిధంగా ఉన్నాయి, ఎలాంటి మార్పులు అవసరమనే దానిపై నాకు అవగాహన ఉన్న విషయం వారికి కూడా తెలుసు'' అని వాద్రా అన్నారు.


మెహుల్ చోక్సీని బెల్జియంపై అరెస్టు చేయడంపై అడిగినప్పుడు, దేశానికి సంబంధించి ఇది చాలా పెద్ద విషయమని అన్నారు. అరెస్టు చేయడం అనే విషయాన్ని అలా ఉంచితే, ప్రజల సొమ్ములను రికవిరీ చేయడం చాలా ముఖ్యమని, ప్రభుత్వం దాని గురించి ఆలోచించాలన్నారు. నీరవ్ మోదీ తదితరులను కూడా వెనక్కి రప్పించాలని వాద్రా సూచించారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

Updated Date - Apr 14 , 2025 | 09:42 PM