Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడిలో రోజుకో ట్విస్ట్.. చొరబాటుదారుడు దొంగగా ఎందుకు మారాడు..
ABN , Publish Date - Jan 23 , 2025 | 11:07 AM
సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం గడిచింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగ్లాదేశీయుడిగా నిందితుడిని గుర్తించారు. ఓ చొరబాటుదారుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరికి ఎందుకు వెళ్లాడానే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడిలో గాయపడిన తర్వాత సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొంది.. ప్రస్తుతం డిశార్జి అయ్యారు. ఇప్పటికీ కేసు విచారణ కొనసాగుతోంది. రోజుకో విషయం బయటకువస్తోంది. అసలు నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎందుకు వెళ్లాడనే విషయంపై స్పష్టత రాలేదు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీకోసం నిందితుడు వెళ్లాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిందితుడుని బంగ్లాదేశ్ దేశస్తుడిగా గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరికి ఎందుకు వెళ్లాడనేదానికి ఎలాంటి సమాధానం దొరకలేదు. పట్టుపట్టి సైఫ్ ఇంటినే నిందితుడు ఎందుకు ఎంచుకున్నాడనేది అతిపెద్ద ప్రశ్న. ముంబయిలో ఎంతోమంది కోటీశ్వరులున్నారు. పెద్దగా పేరు ప్రఖ్యాతలు లేని ధనవంతులు ఉన్నారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకునే అవకాశం తక్కువ. దొంగతనానికి వెళ్లే వ్యక్తి కత్తి తీసుకుని ఎందుకు వెళ్లాడనేది మిస్టరీగా మారింది.
పక్కా ప్లాన్‌తోనేనా..
నిందితుడు మహ్మద్ షరీఫుల్ తనతో కత్తిని తీసుకెళ్లాడంటే పూర్తి ప్లాన్‌తోనే మర్డర్‌కు ప్లాన్ చేశాడా.. లేదంటే బెదిరించడం కోసం కత్తి తీసుకెళ్లారా అనేది విచారణలో తేలాల్సిఉంది. సైఫ్ అలీఖాన్ దాడి ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సొంత మనుషులే సైఫ్ అలీఖాన్‌పై దాడికి ప్లాన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవం ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సిఉంది. సైఫ్ అలీఖాన్ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడటానికి కారణాలను తెలుసుకోవాలి. సైఫ్ అలీఖాన్‌ను అంతమొందించాలనే ఉద్దేశంతో బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తితో ఎవరైనా ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దొంగతనం కోసం నిందితుడు వెళ్తే.. ఇంతకుముందు ఏవైనా చోరీ కేసుల్లో పట్టుబడి ఉండాలి. మొదటిసారి చోరీకి పాల్పడేవ్యక్తి.. ధైర్యంగా ఓ వీఐపీ ఇంటికి వెళ్లడం సర్వసాధారణంగా జరగదు. మహ్మద్ షరీఫుల్ తన మొదటి దొంగతనానికి సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారనేది తెలియాల్సిఉంది.
కత్తి మూడో ముక్క దొరికింది
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేయడానికి ఉపయోగించిన కత్తి మూడవ భాగాన్ని పోలీసులు కనుగొన్నారు. బాంద్రాలోని నటుడు సైఫ్ నివాసానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న సదస్సులో నుంచి కత్తి మూడో ముక్కను స్వాధీనం చేసుకున్నారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స సమయంలో సైఫ్ శరీరం నుండి 2.5 అంగుళాల పరిమాణంలో ఒక కత్తి ముక్కను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను పోలీసులు బుధవారం సరస్సు వద్దకు తీసుకెళ్లి సుమారు గంటన్నర పాటు సంఘటన స్థలంలోనే విచారించారు. ఆ తర్వాత కత్తి మూడో భాగాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈకేసు విచారణలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుండటంతో అసలు సైఫ్ అలీఖాన్‌పై ప్లాన్‌తోనే దాడిచేశారా అనే విషయంలో స్పష్టత రావల్సిఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here