Share News

influential Indians : సత్యం.. సుందరం!

ABN , Publish Date - Jan 22 , 2025 | 02:40 AM

అత్యంత ప్రభావశీలురైన ప్రపంచ భారతీయుల్లో మైక్రోసాఫ్ట్‌ సీఈవో, చైర్మన్‌ సత్య నాదెళ్ల అగ్రస్థానం దక్కించుకున్నారు. రెండో స్థానంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ నిలిచారు. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులతో

influential Indians : సత్యం.. సుందరం!

ప్రపంచ ప్రభావశీల భారతీయుల్లో వీరే టాప్‌

హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌ విడుదల

న్యూఢిల్లీ, జనవరి 21: అత్యంత ప్రభావశీలురైన ప్రపంచ భారతీయుల్లో మైక్రోసాఫ్ట్‌ సీఈవో, చైర్మన్‌ సత్య నాదెళ్ల అగ్రస్థానం దక్కించుకున్నారు. రెండో స్థానంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ నిలిచారు. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులతో కూడిన జాబితాను హెచ్‌ఎ్‌సబీసీ హురున్‌ ‘గ్లోబల్‌ ఇండియన్స్‌-2024’ పేరుతో తొలిసారి జాబితా విడుదల చేసింది. ఇందులో 200 ప్రముఖ కంపెనీలు, 226 వ్యక్తుల గురించి ప్రస్తావించింది. అందులో సాఫ్ట్‌వేర్‌, ఆర్థిక సేవలు, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఫార్మా తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు నేతృత్వం వహించడం ద్వారా భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్దేశిస్తున్నారని హెచ్‌ఎ్‌సబీసీ హురున్‌ కొనియాడింది. ఆ జాబితా టాప్‌ టెన్‌లో సత్య నాదెళ్ల తొలిస్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో గూగుల్‌ (ఆల్ఫాబెట్‌) సీఈవో సుందర్‌ పిచాయ్‌, మూడో స్థానంలో యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌ నిలిచారు. ఇక ఈ జాబితాలో 12 మంది మహిళలు కూడా స్థానం దక్కించుకున్నారు. వారిలో నేహా నర్ఖేడే (కాన్‌ఫ్లూయెంట్‌), అంజలి సూద్‌ (టుబి), యామినీ రంగన్‌ (హబ్‌స్పాట్‌), లీనా నాయర్‌ (చానెల్‌) తదితరులు ఉన్నారు. గతేడాది నవంబరు 29 నాటికి ఆయా కంపెనీల మార్కెట్‌ స్థాయిలను బట్టి హెచ్‌ఎ్‌సబీసీ హురున్‌ ఈ ర్యాంకుల జాబితాను రూపొందించింది.

Updated Date - Jan 22 , 2025 | 02:40 AM