Chief Minister Siddaramaiah: బీజేపీ నేతలపై సీఎం సిద్దరామయ్య ఫైర్
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:13 PM
Chief Minister Siddaramaiah: తమ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కేటాయింపుల్లో మోదీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. దేశ జీడీపీలో కర్ణాటక కీలకంగా వ్యవహరిస్తోన్న.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరు, జనవరి 14: రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయింపులను మోదీ ప్రభుత్వం దారణంగా తగ్గించేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకు రావడం కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడంలో కర్ణాటక బీజేపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్రాలకు పన్నుల వాటా కింది రూ. 1, 73, 030 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఆ క్రమంలో కర్ణాటకకు కేవలం రూ. 6,310 కోట్లు మాత్రమే దక్కిందని చెప్పారు. కేంద్రం కర్ణాటకకు కేటాయించిన వాటా పట్ల.. ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక పట్ల ఎన్డీయే ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకకు రావాల్సిన పన్నుల వాటాపై కన్నడిగుల తరపున మాట్లాడేందుకు బీజేపీ నేతలు ధైర్యం కూడగట్టుకొంటారని గత కొద్ది రోజులుగా తాను వేచి చూస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అదీకాక.. కర్ణాటక ప్రయోజనాలను కాపాడటానికి బదులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించడంలో బిజీగా ఉన్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలపై ఆయన వ్యంగ్య బాణాన్ని సంధించారు. భారత దేశ జనాభాలో కర్ణాటక ప్రజలు 5 శాతం మాత్రమే ఉన్నారని.. అలాగే దేశ జీడీపీలో 8.4 శాతం తోడ్పాటును అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అలాగే దేశంలోని జీఎస్టీ వాటాలో 17 శాతం పెరుగుదలతో రాష్ట్రం ముందున్నారు.
Also Read: మహాకుంభ మేళపై ఆసక్తికర వ్యాఖ్యలు.. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత
కానీ కేంద్రం నుంచి పన్నుల వాటాలో మాత్రం.. సరైన రీతిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో జీఎస్టీ రూపంలో కేంద్రానికి కర్ణాటక ఎంత చెల్లిస్తోంది.. తిరిగి ఆ రాష్ట్రానికి రావాల్సిన వాట ఎంత ఇస్తుందనే అంశాన్ని సీఎం సిద్దరామయ్య సోదాహరణగా వివరించారు. పరిపాలన, జీఎస్టీ వృద్ధి, అభివృద్ధిలో రాణించినందుకు కర్ణాటకను శిక్షిస్తున్నారా? అంటూ కేంద్రాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేటాయింపులను ఈ సందర్భంగా సోదాహరణగా వివరించారు.
అయితే ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో ప్రతి పక్షనేత ఆర్ అశోక్ స్పందించారు. సీఎం సిద్దరామయ్య చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్రం కర్ణాటకకు విడుదల చేసిన నిధుల్లో 65 శాతం ఇప్పటికే ప్రభుత్వం దోచుకోందన్నారు. 50 ఏళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. ఆ సమయంలో ఎంత రాష్ట్రానికి నిధులు విడుదల చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను సూటిగా ప్రశ్నించారు. అయితే గత మన్మోహన్ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల కంటే దాదాపు 5 రెట్ల నిధులను నరేంద్ర మోదీ ప్రభుత్వం కర్ణాటకు విడుదల చేసిందని వివరించారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్దమని ఆయన స్పష్టం చేశారు.
For National New And Telugu News
Updated Date - Jan 14 , 2025 | 04:15 PM