Share News

Economic Survey: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:27 PM

బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.

Economic Survey: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను (Economic Survey 2024-25)ను ఆర్థిక మంత్రి శుక్రవారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, రాబోయే కేంద్ర బడ్జెట్‌ అంచనాలను ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8 శాతం వరకూ ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

Budget-2025: భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా నిలుపుతాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ టర్మ్స్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.4గా నమోదైందని, ఇది ఆర్బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే తక్కువని తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలకు అందుకోలేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని తెలిపింది. సీజనల్ వెజిటబుల్ ధరలు తగ్గడం, ఖరీఫ్ పంట రావడం కారణమని తెలిపింది. ఈ ప్రభావంతో 2026 తొలి ప్రథమార్థంలో కూడా ఆహార ధరలు అదుపులో ఉంటాయన అంచనా వేసింది. అయితే వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ అగ్రికల్చరల్ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావానికి అవకాశాలుంటాయని తెలిపింది. 2024-25 జాతీయ ఆదాయం డాటా దేశంలోని అన్ని రంగాలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపింది. వ్యవసాయరంగం యథాప్రకారం పటిష్టంగా ఉందని, అన్ని ట్రెండ్ లెవెల్స్‌ను అధిగమించిందని తెలిపింది. పారిశ్రామిక రంగం సైతం కోవిడ్ మహమ్మారికి ముందున్న పరిస్థితిని అధిగమించి పురోగమిస్తోందని తెలిపింది. సేవారంగం పుంజుకుందన్నారు.


గ్లోబల్ ఎనర్జీ, సరకుల ధరలు సాఫ్టెన్‌గా ఉండవచ్చని, అయితే అంతర్జాయ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నుంచి సవాళ్లు ఉండొచ్చని అంచనా వేసింది. భారత విదశీ మాదక ద్రవ్య నిల్వలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపింది. జనవరి 2024కు నిల్వలు 616,7 బిలియన్ డాలర్లు ఉండగా, 2024 సెప్టెంబర్ నాటికి 704.9 బిలియన్ డాలర్లు ఉన్నాయని తెలిపింది. ఫార్మల్ ఎంప్లాయిమెట్ సెక్టార్‌లో గణనీయమైన ప్రగతి ఉన్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. నెట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సబ్‌స్క్రిప్షన్లు రెండింతలు పెరిగాయని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 61 లక్షల సబ్‌స్క్రిప్షన్లు 2024 ఆర్థిక సంవత్సరానికి 131 లక్షలకు చేరినట్టు పేర్కొంది.


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 03:37 PM