Karnataka: సీఎం సమక్షంలో లొంగిపోయిన ఆరుగురు నక్సల్స్
ABN, Publish Date - Jan 08 , 2025 | 09:36 PM
లొంగిపోయిన నక్సలైట్లకు వివిధ నేరాలతో ప్రమేయముందని, వీరి తలపై రివార్డును కూడా ఉందని అధికారులు తెలిపారు. నక్సలైట్లు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సిద్ధరామయ్య వారం రోజుల క్రితం పిలుపునిచ్చారు.
బెంగళూరు: కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సమక్షంలో ఆరుగురు కరడుగట్టిన నక్సలైట్లు బుధవారంనాడు లొంగిపోయారు. వీరిలో కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన నక్సల్స్ ఉన్నారు. కర్ణాటకకు చెందిన సుందరి కుట్లూరు, లతా ముందగరు, మారప్ప అరోలి, వనజాక్షి బలెహోలె, కేరళలోని వయనాడ్‌కు చెందిన జిషా, తమిళనాడుకు చెందిన కె.వసంత తమ యూనిఫాం, సరెండర్ లెటర్‌ను సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర, ఇతర మంత్రులు, సీనియర్ పోలీసు అధికారులకు అప్పగించి లొంగిపోయారు.
Atishi: సీఈసీ అర్జెంట్ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం లేఖ
లొంగిపోయిన నక్సలైట్లకు వివిధ నేరాలతో ప్రమేయముందని, వీరి తలపై రివార్డును కూడా ఉందని అధికారులు తెలిపారు. నక్సలైట్లు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సిద్ధరామయ్య వారం రోజుల క్రితం పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించే స్కీమ్‌లను మరింత సులభతరం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రొగ్రసివ్ గ్రూప్‌తో కొద్దికాలంగా మంతనాలు సాగిస్తున్న నక్సలైట్లు లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
ఉడిపి జిల్లాలో నవంబర్ 20న యాంటి నక్సల్స్ ఫోర్స్ చేతిలో యాంటి-నక్సల్ లీడర్ విక్రమ్ గౌడ హతమయ్యాడు. ఈ క్రమంలో నక్సల్ కార్యకలాపాలపై సిద్ధరామయ్య సర్కార్ దృష్టి సారించింది. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని ఇచ్చిన పిలుపునకు స్పందించి తాము ప్రభుత్వం ముందు లొంగిపోయినట్టు ఆరుగురు నక్సల్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Supreme Court: సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి
ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్ పోల్’
Read Latest National News and Telugu News
Updated Date - Jan 08 , 2025 | 09:36 PM