S.Jaishankar: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఎస్.జైశంకర్
ABN, Publish Date - Jan 12 , 2025 | 02:32 PM
అమెరికా కొత్త పాలనాధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో జైశంకర్ చర్చలు జరిపే అవకాశాలున్నట్టు విదేశాంగ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జనవరి 20 ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అమెరికా కొత్త పాలనాధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో జైశంకర్ చర్చలు జరిపే అవకాశాలున్నట్టు విదేశాంగ శాఖ (MEA) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
Arvind Kejriwal: ఆ పని చేస్తే నేను పోటీ చేయను.. అమిత్‌షాకు కేజ్రీ సవాల్
ట్రంప్-వాన్సె ఇనాగరల్ కమిటీ ఆహ్వానం మేరకు 47వ దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ఎస్.ట్రంప్ ప్రమాణస్వీకారానికి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భారత్ తరఫున హాజరవుతున్నారని ఎంఈఏ తెలిపింది. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఆ దేశ 45వ అధ్యక్షుడిగా 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకూ ఆయన తొలిసారి పగ్గాలు చేపట్టారు. గత నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ విజయం సాధించారు. అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదకగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రపంచ దేశాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
జైశంకర్ గత పర్యటన
కాగా, దీనికి ముందు గత డిసెంబర్ 24 నుంచి 29 వరకూ జైశంకర్ అమెరికాలో అధికార పర్యటన జరిపారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ట్రంప్ నామినీ మైఖేల్ వాల్ట్స్‌ను కలుసుకున్నారు. ట్రంప్ కొత్త అడ్మినిస్ట్రేషన్, భారత ప్రభుత్వం మధ్య జరిగిన తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలతో సహా పలు అంశాలపై జైశంకర్, వాల్ట్స్ ఈ సమావేశంలో చర్చించారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు
Read Latest National News and Telugu News
Updated Date - Jan 12 , 2025 | 03:24 PM