Share News

Speaker: సీటీ రవి వివాదంలో నా నిర్ణయమే అంతిమం..

ABN , Publish Date - Jan 14 , 2025 | 11:22 AM

బెళగావి సువర్ణసౌధ విధానపరిషత్‌లో డిసెంబరు 19న మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌(Minister Lakshmi Hebbalkar), బీజేపీ సభ్యుడు సీటీ రవిల మధ్య వాగ్వాదంపై పరిషత్‌ సభాపతి బసవరాజహొరట్టి(Basavarajahoratti) మరోసారి మండిపడ్డారు. ఈ వివాదంపై తన నిర్ణయమే అంతిమమన్నారు.

Speaker: సీటీ రవి వివాదంలో నా నిర్ణయమే అంతిమం..

- సీఐడీకి కేసు సరికాదు

- సభాపతి హొరట్టి

బెంగళూరు: బెళగావి సువర్ణసౌధ విధానపరిషత్‌లో డిసెంబరు 19న మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌(Minister Lakshmi Hebbalkar), బీజేపీ సభ్యుడు సీటీ రవిల మధ్య వాగ్వాదంపై పరిషత్‌ సభాపతి బసవరాజహొరట్టి(Basavarajahoratti) మరోసారి మండిపడ్డారు. ఈ వివాదంపై తన నిర్ణయమే అంతిమమన్నారు. బెంగళూరు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదన్నారు. సభలో జరిగిన వివాదంపై సీఐడీకి కేటాయించడం తగిన చర్య కాదన్నారు. రాజ్యాంగ సంఘర్షణకు కారణం కానుందన్నారు. సీటీ రవి(CT Ravi) అనుచితమైన పదాలు వాడినట్లు సాక్ష్యం లేదని తీర్మానించినా ప్రభుత్వం సీఐడీకి కేటాయించడం సమంజసం కాదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Ravi Mohan: నన్ను అసలు పేరుతోనే పిలవండి ప్లీజ్‌..


pandu1.2.jpg

కర్ణాటక విధానపరిషత్‌ కార్యాచరణ, నిబంధనలు లోక్‌సభ, రాజ్యసభ నిబంధనలు, కౌల్‌ అండ్‌ సెక్టర్‌ ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌ ఆఫ్‌ పార్లమెంటును పరిశీలించిన తర్వాతనే సభాపతి హోదాలో తీర్పునిచ్చానన్నారు. సభాపతి రూలింగ్‌కు భంగం కలిగించేలా పాలనా విధానం వర్తించరాదన్నారు. రాజ్యాంగానికి మూలమైన శాసనాంగ, సభాపతికి ఉండే హక్కులు, అధికారాలను భంగం కలిగించేలా సీఐడీ విచారణకు ఆదేశించారన్నారు. పరిషత్‌ తన సభ్యులను శిక్షించే అధికారం ఉందని ఇప్పటివరకు ఇదే ప్రక్రియ సాగిందన్నారు. దశాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయాలను సభాకలాపాల వేళ తలెత్తిన విబేధాలను నియంత్రించే అధికారం సభాపతి ఉంటుందన్నారు.


అంతిమంగా సభాపతి తీర్మానమే కీలకమన్నారు. సీఐడీకి కేసును అప్పగించడం ద్వారా రాజ్యాంగ సంఘర్షణకు అవకాశం ఇచ్చారన్నారు. శాసనసభ, పాలనా రంగాల మధ్య అనవసరమైన సంఘర్షణకు అవకాశం ఇవ్వరాదన్నారు. పరిషత్‌లో జరిగిన సంఘటన సభాపతి పరిధిలోకి రావడం సహజమన్నారు. హోం మంత్రి పరమేశ్వర్‌ పలు రాజ్యాంగబద్ధమైన పదవులలో కొనసాగిన అనుభవం ఉందన్నారు. వాటి పరిధిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదన్నారు.


pandu1.3.jpg

ఇదే విషయమై హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) మాట్లాడుతూ.. పరిషత్‌ సభాపతి రాసిన లేఖ మాకు అందలేదన్నారు. సభాపతి చట్టపరంగానే తీర్పు ఇచ్చారని, మేం చట్ట పరిధిలోనే విచారణ జరిపిస్తామన్నారు. వివాదాలకు చెక్‌పెట్టాలనే సంఘటనకు సంబంధించి వాస్తవాలను గుర్తించేందుకు సీఐడీకి అప్పగించామన్నారు. దీంతో రాజ్యాంగ సంఘర్షణ కాదన్నారు. శాసనసభ పరంగా సార్వభౌమత్వానికి భంగం కలగకుండా పరిశీలించాలన్నారు. వాగ్వాదం జరిగిన వెంటనే మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌(Minister Lakshmi Hebbalkar) పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదల చేశారన్నారు. ఎఫ్‌ఐఆర్‌పై విచారణ జరగాల్సి ఉందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 11:22 AM