ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Army: ఎల్ఏసీ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా.. ఆర్మీ చీఫ్

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:53 PM

పెట్రోలింగ్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇరువైపుల అధికారుల మధ్య రెండు రౌండ్ల చర్చలు కూడా పూర్తయ్యాయని, ఉభయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దులు పంచుకున్న వాస్తవాధీ రేఖ (LAC) వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా స్థిరంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. ఇరువైపుల పలు విడతలు చర్చలు సైతం జరిగినట్టు చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో డెప్సాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ మొదలైందని అన్నారు.

PM Modi: కశ్మీర్‌లో జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని.. పాల్గొన్న నితిన్ గడ్కరీ, జమ్ము-కాశ్మీర్ సీఎం


న్యూఢిల్లీ సోమవారం జరిగిన వార్షిక్ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 20 నుంచి ఇరువైపు బలగాలు డెస్పాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ జరుపుతున్నాయని, ఒకరి ప్రాంతాల వైపు మరొకరు వెళ్లడం ఆగిందని చెప్పారు. పెట్రోలింగ్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇరువైపుల అధికారుల మధ్య రెండు రౌండ్ల చర్చలు కూడా పూర్తయ్యాయని, ఉభయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. గ్రేజింగ్ గ్రౌండ్‌కు సంబంధించి పరస్పరం అంగీకారం ఉందని, బఫర్ జోన్‌ అనేదేమీ లేదని చెప్పారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సమయంలో చర్చల ప్రకారం కొన్ని ప్రాంతాలను ''టెంపరరీ మారటోరియం''గా ప్రకటించారని అన్నారు. ఉమ్మడి ప్రాంతాలకు దూరంగా సంయమనం పాటించడం వల్ల ఘర్షణల స్థాయి పెరక్కుండా ఉండేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రశాంత పరిస్థితిని నెలకొనేందుకు, పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ఇరుదేశాల మధ్య విస్తృత అవగాహన అవసరమని అన్నారు. ఏప్రిల్ 20 తర్వాత పరస్పర విశ్వాసానికి ఇరుదేశాలు కొత్త నిర్వచనం ఇచ్చాయని తెలిపారు. కలిసి కూర్చుని చర్చించుకోవడం ద్వారా పరస్పర విశాంత మరింత పెరుగుతుందన్నారు. తదుపరి జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశం కోసం తాము ఎదురచూస్తున్నట్టు చెప్పారు.


జమ్మూకశ్మీర్‌లో..

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ద్వివేది తెలిపారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో భారత బలగాలు మట్టుబెట్టిన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాక్ నుంచే వచ్చారని చెప్పారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో చురుకుగా ఉన్న ఉగ్రవాదుల్లో 80 శాతం మంది పాక్ నుంచే వచ్చారని తెలిపారు. 2024లో 15,000 మంది అదనపు బలగాలను మోహరించి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు.


బంగ్లాదేశ్‌ పరిస్థితిపై...

బంగ్లాదే‌శ్‌తో పరిస్థితిపై ద్వివేది మాట్లాడుతూ, భారతదేశం వ్యూహాత్మకంగా తమకు కీలకమని బంగ్లాదేశ్ చీఫ్ ఇటీవల మాట్లాడరని, భారత్‌ విషయం కూడా అంతేనని ద్వివేది చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలైనందున కలిసి బతకాలని, ఒకరినొకరు అర్ధం చేసుకోవాలని, శత్రుత్వం ఎవరికీ మంచిది కాదని అన్నారు. ప్రస్తుతానికైతే ఎటువైపు నుంచి ఇబ్బందులు లేవని, బంగ్లాదేశ్ చీఫ్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. నవంబర్‌లో కూడా వీడియో కన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని, ఎన్‌డీసీ కోసం మన ఆఫీసర్లు కూడా అక్కడకు వెళ్లారని చెప్పారు. సంయుక్త విన్యాసాల విషయం మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేశామన్నారు. ఇప్పటికైతే ఇరుదేశాల మిలటరీ సంబంధాలు సజావుగా ఉన్నట్టు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 03:53 PM