Share News

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:44 PM

Tahawwur Rana: ముంబై దాడుల కేసులో నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా యాంటీ టెర్రర్ ఏజెన్సీకి సంబంధించిన సీజీఓ కాంప్లెంక్స్ ఆఫీస్‌లోని హై సెక్యూరిటీ సెల్‌లో ఉన్నాడు.ఎన్ఐఏ అధికారులు ప్రతీ రోజూ 8 నుంచి 10 గంటల పాటు అతడ్ని విచారిస్తున్నారు.

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..
Tahawwur Rana

ఢిల్లీ: ముంబై దాడుల కేసులో నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీ కోర్టు ఎన్ఐఏ అభ్యర్థన మేరకు అతడ్ని 18 రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రతీ 48 గంటలకు ఒకసారి అతడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాదు.. రాణాకు తన లాయర్‌ను కలుసుకునే అవకాశం కూడా కల్పించింది. ముంబై దాడుల సమయంలో కుట్రదారులు భారత్‌లోని మరికొన్ని నగరాలను టార్గెట్‌గా చేశారని కూడా కోర్టు పేర్కొంది. తహవ్వూర్ రాణాపై హత్య, భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధం, ఉగ్ర కార్యాకలాపాల కింద కేసులు నమోదు అయ్యాయి. అతడు ప్రస్తుతం యాంటీ టెర్రర్ ఏజెన్సీకి సంబంధించిన సీజీఓ కాంప్లెంక్స్ ఆఫీస్‌లోని హై సెక్యూరిటీ సెల్‌లో ఉన్నాడు.


జైలులో ఉన్న అతడు ఓ పెన్ను, పేపర్లు, ఖురాన్ అడిగినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ జైలు అధికారులు అతడికి ఇచ్చారట. తహవ్వూర్ ఆహారం విషయంలోనూ ఎలాంటి స్పెషల్ రిక్వెస్ట్‌లు చేయలేదట. అధికారులు అందరు ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే అతడికి కూడా అందిస్తున్నారట. ఇక, ఎన్ఐఏ అధికారులు ప్రతీ రోజూ 8 నుంచి 10 గంటల పాటు అతడ్ని విచారిస్తున్నారు. అతడి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఎవిడెన్స్‌ల ఆధారంగా విచారణ సాగుతోందని సమాచారం. ముంబై దాడుల్లో మరో కుట్రదారుడైన డేవిడ్ కోలెమ్యాన్ హెడ్లేతో ఎక్కువ సార్లు తహవ్వూర్ ఫోన్‌లో మాట్లాడాడు.


వాటి గురించి కూడా అధికారులు విచారించారని తెలుస్తోంది. డేవిడ్ కోలెమ్యాన్ హెడ్లేను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు అమెరికాలోని ఓ జైలు ఉన్నాడు. 2008 ముంబై దాడులకు ముందు తహవ్వూర్ ఇండియాలోని పలు నగరాలకు తరచుగా వెళ్లి వచ్చాడు. వాటి గురించిన సమాచారం తెలుసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. లస్కర్ ఈ తోయిబాతో పాటు ఎల్ఈటీ, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ లాంటి ఉగ్ర గ్రూపులతో అతడికి ఉన్న సంబంధాలపై కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారుల హస్తం ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Summer Tips: ఈ 5 సింపుల్ టిప్స్ తో వడదెబ్బ నుండి ఉపశమనం..

BJP: అధికారం చేపట్టే స్థాయికి పార్టీని తీసుకెళతా..

Updated Date - Apr 15 , 2025 | 01:46 PM