NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:02 PM

నీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చిరకాలంగా సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని ఎంకే స్టాలిన్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

చెన్నై: వైద్య విద్యకు అవసరమైన ప్రవేశపరీక్ష "నీట్" (NEET) విషయంలో తమిళనాడులోని ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 'నీట్' నుంచి తమిళనాడును మినహాయించాలని, 12వ తరగతి మార్కులు ఆధారంగా తమిళనాడు విద్యార్థులకు వైద్యవిద్య కోర్సులో ప్రవేశాలు కల్పంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించినట్టు స్టాలిన్ తమళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు తెలిపారు.

PM Modi: యూనస్‌తో మోదీ భేటే.. బంగ్లాలో హిందువుల భద్రతపై ప్రస్తావన


తమిళనాడు అసెంబ్లీలో 2021, 2022లో రెండుసార్లు బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, తాజాగా ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించారని స్టాలిన్ చెప్పారు. స్కూల్ పెర్‌ఫారమెన్స్ ఆధారంగా అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని గత ఏడాది జూన్‌లో సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. తమళనాడు ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరణలు ఇచ్చినప్పటికీ నీట్ నంచి తమిళనాడును మినహాయించేందుకు కేంద్రం నిరాకరించిందన్నారు. నీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చిరకాలంగా సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు. ఇదేసమయంలో కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని, న్యాయనిపుణలతో సంప్రదిస్తున్నామని సీఎం తెలిపారు.


కాగా, ప్రస్తుతం త్రిభాషా వివాదం, డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు, కేంద్ర మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా 'నీట్' అశం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.


ఇవి కూడా చదవండి..

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:04 PM