Bijapur Maoist Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:12 AM
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఈ చర్యను చేపట్టి మావోయిస్టులను ఎదిరించారు

ముగ్గురు మావోయిస్టుల మృతి
చర్ల, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారమందడంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. మృతుల్లో ఇంద్రావతి ఏరియా కమిటీ మెంబర్ అనిల్‌పై రూ.5లక్షల రివార్డు ఉందని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. మరోవైపు దంతెవాడ జిల్లాలో శనివారం 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..