Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:45 PM
కర్ణాటక రాష్ట్రం హుస్సూరులో మద్దూరమ్మ రథోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బలమైన గాలులు కారణంగా రెండు రథాలు నెలకూలాయి. ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది.

కర్ణాటక: హుస్సూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మద్దూరమ్మ రథోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ రెండు రథాలు మీద పడి ఇద్దరు భక్తులు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మద్దూరమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి ఏటా మాదిరిగానే పెద్దఎత్తున రథోత్సవం నిర్వహించేందుకు నిశ్చయించారు.
ఈ మేరకు ఐదు భారీ రథాలను సిద్ధం చేశారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ఉరేగింపు కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే బెంగళూరు జాతీయ రహదారి ఎలక్ట్రానిక్ సిటీ వద్దకు రాగానే పెద్దఎత్తున గాలి దుమారం చెలరేగింది. బలంగా గాలులు వీయడంతో రెండు రథాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో రథాల కింద పడి ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను స్థానికులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. రథాలు కూలిపోతుండగా వందల మంది భక్తులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు అంచనా వేయకుండా పెద్దపెద్ద రథాలను ఏర్పాటు చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. బాధితులను మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Khammam: మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఈ మార్గం గుండా వెళ్తే చుక్కలే..