Share News

Bengaluru: ఉల్లాల.. వన్యప్రాణులు విలవిల

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:03 PM

ఉల్లాల చెరువు ఎండిపోయింది. ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ నెల మొదటి వారంలోనే చెరువు ఈ ఎండిపోవడం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ చెరువులో చుక్కనీరు కూడా లేకపోవడంతో ముఖ్యంగా వన్యప్రాణులు విలవిల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Bengaluru: ఉల్లాల.. వన్యప్రాణులు విలవిల

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కీలక చెరువుల్లో ఒకటైన ఉల్లాల చెరువు ఎండిపోయింది. చుక్కనీరు లేకుండా రాళ్లు బయటపడ్డాయి. దీంతో చెరువులోని వన్యఫ్రాణులు దాహంతో విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా అందాలు పంచే నెమళ్లు దాహంతో విలవిలలాడుతున్నాయి..పురులు విప్పి నాట్యమాడే మయూరాలు చుక్క నీటికీ నోచుకోవడం లేదు. నగరంలోని కెంగేరి ప్రాంతం ఉల్లాల చెరువులో వన్యప్రాణులు దాహార్తితో విలవిలలాడుతున్నాయి. వర్షాకాలంలో వచ్చిన నీరు ఫిబ్రవరికే ఇంకిపోయింది.

ఈ వార్తను కూడా చదవండి: Slouch Caps: స్లోచ్‌ క్యాప్‌.. ఇక కనపడదు..


pandu2.3.jpg

బీబీఎంపీ(BBMP) లక్షల రూపాయలు ఖర్చు చేసి మురుగునీరు శుద్ధీకరించి చెరువులలోకి వదిలే పైప్‏లైన్ పనులు నాసిరకం కావడంతో రాళ్లు, రప్పలూ తేలిపోయి ఎడారిని తలపిస్తోంది. దీంతో వన్యప్రాణులు నీరు లేక విలవిలలాడుతున్నాయి. ఉల్లాల చెరువులో 25కుపైగా నెమళ్లు, కుందేళ్లు, తాబేళ్లతోపాటు 20 రకాల పక్షులు తాగునీటికోసం తల్ల డిల్లుతున్నాయి. అధికారులు తగిన ఏర్పాట్లు చేసి పక్షల దాహార్తి తీర్చాలని నగరవాసులు కోరుతున్నారు.


pandu2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!

విధ్వంసమే మీ ఎజెండానా

డబుల్‌ బెంబేలు

ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2025 | 01:03 PM