Viral Video: పాపం పసివాడు.. అన్నను కాపాడుకోవడం కోసం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:07 PM
అన్నపై తమ్ముడికుండే ప్రేమకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బాధపడుతున్న అన్నను కాపాడుకోవడం కోసం ఓ చిన్నారి సాహసమే చేశాడు. ఆ వివరాలు..

రాయ్‌బరేలీ: సమాజ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన విద్య, వైద్య సదుపాయాల కల్పనలో మన ప్రభుత్వాలు ఓడపోయాయి. గవర్నమెంటు ఆస్పత్రులు, స్కూళ్లలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది. వీటిల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఘటన ఒకటి వెలుగు చూసింది. అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే స్థోమత లేదు.. ప్రభుత్వ ఆస్పత్రే శరణ్యం. అక్కడికి వెళ్లడానికి కూడా అన్నకు ఓపిక లేదు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేదు. కానీ ఎలాగైనా అన్నను కాపాడుకోవాలని భావించిన ఆ తమ్ముడు.. చెత్త రిక్షాలో సోదరుడిని పడుకుబెట్టి ఆస్పత్రికి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ చిన్నారి కష్టం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఆ వివరాలు..
ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్, రాయ్‌బరేలీలో చోటు చేసుకుంది. ఉంచారా ప్రాంతంలోని హసన్‌పూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల కుర్రాడు గోడ మీద నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పిల్లాడిని ఆస్పత్రికి తరలించాలని భావించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఎంత ప్రత్నించిన అటు వైపు నుంచి నో రెస్పాన్స్. ఇటు చూస్తేనేమో పిల్లాడి పరిస్థితి నిమిషనిమిషానికి విషమిస్తుంది. ఎవరినైనా సాయం కోరదామన్న.. సమయానికి ఎవరూ అందుబాటులో లేరు. ఏం చేయాలో పాలుపోక అలానే ఉన్నారు.
అన్నకు దెబ్బలు తగిలి బాధపడటం తట్టుకోలేకపోయిన బాధితుడి తమ్ముడు ఒక ఉపాయం ఆలోచించాడు. పక్కనే చెత్త తీసుకెళ్లే రిక్షా కనిపించడంతో వెంటనే వెళ్లి దాన్ని తీసుకువచ్చాడు. తర్వాత అన్నను దానిలో పడుకోబెట్టుకుని.. కష్టపడి రిక్షాను ఆస్పత్రికి వద్దకు తీసుకెళ్లాడు. రిక్షా వెనక ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండటం వీడియోలో చూడవచ్చు. ఆమెని చిన్నారుల తల్లిగా భావిస్తున్నారు.
ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. పాపం చిన్నోడికి ఎంత పెద్ద కష్టమొచ్చింది అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు నెటినుల. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Mob Beat Temple Priest: మరీ ఇంత దారుణమా.. పూజారి అనే కనికరం కూడా లేకుండా
Viral Video: UFC ఈవెంట్‌లో ట్రంప్ స్టెప్స్..వైరల్ అవుతున్న డాన్స్ వీడియో