Body From Grave: 135 రోజుల తర్వాత మహిళ శవం బయటకు
ABN , Publish Date - Apr 15 , 2025 | 08:29 AM
నజియా చెల్లెలు అక్క హత్య, తన రేపు గురించి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులకు కూడా చెప్పింది. నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫిబ్రవరి 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా లాభం లేకపోవటంతో కోర్టుకు వెళ్లింది.

రోడ్డు పక్కన ఓ శవాన్ని పూడ్చి పెట్టారని తెలియటంతో జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడ నిజంగా శవం ఉందా? లేదా? అన్నది అందరికీ ఓ అంతుచిక్కని విషయం. ఓ పెద్ద జేసీబీ అక్కడికి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న భూమిని తవ్వటం మొదలెట్టింది. కొద్దిసేపటి తర్వాత అందరూ షాక్ అయ్యేలా.. నిజంగానే అక్కడ శవం బయటపడింది. పూడ్చి పెట్టిన 135 రోజుల తర్వాత శవం బయటకు వచ్చింది. ఈ సంఘటన కేవలం ఆ గ్రామంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ మహిళ శవం ఎవరిది? అక్కడ ఆమెను ఎవరు పూడ్చి పెట్టారు? అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం క్రైమ్ స్టోరీ చదివేయాల్సిందే..
చెల్లెలిపై రేప్.. అక్క హత్య..
సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలి చెల్లెలు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మావు జిల్లాలోని పట్టి మహ్మద్‌పూర్ గ్రామానికి చెందిన ఆయు అనే వ్యక్తికి నజియా ఖాతూన్‌తో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ, నజియా ఖాతూన్‌ను అత్తింటి వారు చంపేశారు. తర్వాత ఆ శవాన్ని ఎవరీకి తెలియకుండా ఖాజీపురలో రోడ్డు ప్రక్కన పూడ్చి పెట్టారు. ఆయు.. నజియా ఖాతూన్ చెల్లెలిపై అత్యాచారం కూడా చేశాడు. నవంబర్ 30వ తేదీన నజియా చెల్లెలు అక్క హత్య, తన రేపు గురించి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులకు కూడా చెప్పింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, పోలీసులు మర్డర్ సెక్షన్లు తీసేసి విచారణ చేయటం మొదలెట్టారు. దీంతో బాధితురాలు కోర్టుకు వెళ్లింది. కోర్టులో పిటిషన్ వేసింది. ఏప్రిల్ 13వ తేదీన కోర్టు పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీయాలని ఆదేశాలు జారీ చేసింది. మండల అధికారులు, పోలీసులు జేసీబీ సాయంతో శవాన్ని బయటకు తీశారు. నజియాను పూడ్చి పెట్టిన దాదాపు 135 రోజుల తర్వాత శవం బయటపడింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి తదుపరి విచారణ ఉండనుంది.
ఇవి కూడా చదవండి
Secunderabad: కుషాయిగూడలో వృద్ధురాలి హత్య
Srisailam: శ్రీ బ్రమరాంబ దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం