Waqf Bill 2024: ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసిన బీజేపీ
ABN, Publish Date - Apr 01 , 2025 | 05:54 PM
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను బుధవారంనాడు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారని, దీనిపై 8 గంటలసేపు చర్చ జరపాలని బీఏసీ సమావేశం నిర్ణయించిందని, అవసరాన్ని బట్టి సమయం పొడిగించే వీలుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బావిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు (Waqf amendment bill) బుధవారంనాడు పార్లమెంటు ముందుకు రాబోతోంది. ఈ బిల్లుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం లభించేలా చూసేందుకు అధికార పార్టీ పట్టుదలగా ఉండటం, దీనిని పలు కారణాలతో విపక్షాలు విభేదిస్తున్న క్రమంలో బిల్లును ఈనెల 2న లోక్‌సభలో ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం ఓటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ మూడులైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా బుధవారంనాడు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని, రోజంతా ఉండాలని, ప్రభుత్వ వైఖరికి బాసటగా నిలడాలని పార్టీ ఎంపీలను బీజేపీ కోరింది.
Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే
కాగా, వక్ఫ్ బిల్లుపై చర్చా సమయం, పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయింపుపై చర్చించేందుకు బీఏసీ సమావేశానికి బీజేపీ మంగళవారంనాడు పిలుపునిచ్చారు. బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయించాలని బీఏసీలో నిర్ణయించారు. అయితే 12 గంటల సేపు చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.
పొడిగించే అవకాశం కూడా ఉంది: రిజిజు
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను బుధవారంనాడు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారని, దీనిపై 8 గంటలసేపు చర్చ జరపాలని బీఏసీ సమావేశం నిర్ణయించిందని, అవసరాన్ని బట్టి సమయం పొడిగించే వీలుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభలో చర్చను తాము కోరుకుంటున్నామని, ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని, సవరణ బిల్లుపై ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుందో ప్రజలు కూడా తెలుసుకోవాలని అనుకుంటారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Ranveer Allahbadia: రెండు వారాల తర్వాతే.. అల్హాబాదియా పాస్‌పోర్ట్ రిలీజ్‌పై సుప్రీంకోర్టు
Pryagraj Demolitions: ప్రయాగ్‌రాజ్ బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం ఆగ్రహం.. నష్టపరిహారానికి ఆదేశం
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
For National News And Telugu News
Updated Date - Apr 01 , 2025 | 06:05 PM