Waqf bill: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం: ఒవైసీ
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:38 PM
వక్ఫ్ బోర్డ్ యూజర్ కాజ్‌ను తొలగించే అవకాశాలున్నాయని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందువల్ల వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారు వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటారని అన్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill 2024)ను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్టు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) తెలిపారు. ముస్లింల మతపరమైన సంస్థలు, ఆస్తులను నియంత్రించడం అంటే ముస్లింల హక్కులను ఉల్లంఘించడమేనని ఓ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన తెలిపారు. వక్ఫ్ బిల్లుపై కోర్టులకు వెళ్తామని, చట్టపరమైన పోరాటం సాగిస్తామని చెప్పారు.
Tamilnadu BJP Chief: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆ నలుగురు
వక్ఫ్‌బోర్డులోని కీలకాంశాలను ఆయన ప్రస్తావిస్తూ, వక్భ్ బోర్డు అనేది ఇస్లామిక్ మత ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆస్తులను నిర్వహించే మతపరమైన సంస్థ అని, ప్రభుత్వ సంస్థ కాదని అన్నారు. హిందు, సిక్కు, జైన మతాలకు చెందిన బోర్డుల్లో ఇతర మతవిశ్వాసాలు ఉన్న వారిని అనుమతించరని, అలాగే వక్ఫ్ బోర్డు ముస్లిం కమ్యూనిటీ కంట్రోల్ లోనే ఉండాలని అన్నారు. వక్ఫ్ బోర్డ్ "యూజర్ కాజ్''ను తొలగించే అవకాశాలున్నాయని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందువల్ల వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారు వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటారని అన్నారు. ఇందులో మార్పులు చోటుచేసుకుంటే వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న వారు యాజమాన్య హక్కులు పొందుతారన్నారు. ఇది రాజ్యాంగంలోని 15,21 నిబంధనలను ఉల్లఘించడమే అవుతుందని చెప్పారు. సమానత్వం, హక్కుల పరిరక్షణకు ఈ నిబంధనలు గ్యారెంటీ ఇస్తున్నాయని చెప్పారు. వక్ఫ్ ఆస్తులు ఎంతమాత్రం ప్రభుత్వ ఆస్తులు కావని, అవి పూర్తిగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆస్తులని అన్నారు.
కొత్త సవరణల వల్ల వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుని తమ అధికారుల పరం చేస్తుందని అన్నారు. ఇది ముస్లింల హక్కులను కాలరాయడమేనని చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని ఒవైసీ ఆక్షేపణ తెలిపారు. ఇండియాలోని ముస్లింలు ప్రభుత్వ చర్యలతో ఇబ్బందుల పాలవుతూ, సామాజిక వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. ఇండియాలోని ఇతర మత సంస్థలు ఏవిధమైన హక్కులు కలిగి ఉన్నారో అలాంటి హక్కులే ముస్లింలకు ఉండాలని, వక్ఫ్ సవరణ బిల్లుపై చట్టపరమైన పోరాటాలు జరుపుతామని ఒవైసీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News