AAP vs BJP: ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..
ABN , Publish Date - Feb 08 , 2025 | 08:22 AM
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందా, దేశ రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Delhi Election Results 2025) కౌంటింగ్ మొదలైంది. ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా అనేక మంది ఆసక్తితో ఉన్నారు. దీంతోపాటు ఈసారి పోటీ చేసిన 699 మంది అభ్యర్థులు కూడా తాము గెలుస్తామా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ప్రకటించిన ప్రకారం చూస్తే బీజేపీ (BJP) గెలుస్తుందని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రం తాము నాలుగోసారి గెలుపు సాధిస్తామని చెబుతున్నారు.
బీజేపీ మాత్రం..
ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో బీజేపీ 27 సంవత్సరాల నిరీక్షణ ముగుస్తుందా అంటే, బీజేపీ నేతలు ఔననే అంటున్నారు. ఈసారి తాము గెలుస్తామని ధీమాతో ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆప్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. యుమునా నది కాలుష్యం సహా అనేక హామీలను నెరవేర్చలేదని అన్నారు. దీంతోపాటు లిక్కర్ స్కాం సహా పలు విషయాల్లో అనేక మంది ఆప్ నేతలు జైలుకెళ్లారని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో రాజధాని ప్రజలు ఈసారి బీజేపీకే అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆప్ మాత్రం..
మరోవైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను పార్టీని వీడేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీని ఆరోపించింది. దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జిట్ పోల్‌పై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఒక పార్టీకి 55 కంటే ఎక్కువ సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. దానికి గల కారణాలను చెప్పాలని అన్నారు. అయితే కేకే సర్వేలు మాత్రం ఆప్ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసింది. కానీ ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీ, ఆప్ మధ్యనే ఉంది.
మొదటగా..
ఫిబ్రవరి 5న ఓటింగ్ తర్వాత, ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తరువాత ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కౌటింగ్ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ట్రెండ్‌లు క్రమంగా వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ 36 స్థానాలు గెలుస్తుందో, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..
Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News