Share News

Muskan: ముస్కాన్ పేరు చెబితే చాలు.. ఆమె వెన్నులో వణుకు..

ABN , Publish Date - Apr 06 , 2025 | 08:22 AM

Muskan News: మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్‌ను అతడి భార్య ముస్కాన్ ప్రియుడితో కలిసి చంపేసిన సంగతి తెలిసిందే. భర్తను చంపిన తర్వాత శవాన్ని 15 ముక్కలు చేసింది. దాన్ని బ్లూ డ్రమ్ములో పడేసి సిమెంట్ కప్పేసింది. ముస్కాన్ ఇప్పుడు క్రైములు చేయాలనుకునే భార్యలకు స్పూర్తిగా మారింది.

Muskan: ముస్కాన్ పేరు చెబితే చాలు.. ఆమె వెన్నులో వణుకు..
National News

ఉత్తర ప్రదేశ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ విషాదాంతం గురించి తెలిసే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ప్రియుడితో కలిసి సౌరభ్‌ను దారుణంగా చంపేసింది. 15 ముక్కలుగా కోసి, డ్రమ్‌లో పడేసి సిమెంట్‌తో కప్పేసింది. సౌరభ్‌ను చంపిన అతడి భార్య ముస్కాన్.. ఆమె ప్రియుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక, ముస్కాన్ చాలా మంది భార్యలకు ఓ స్పూర్తిగా నిలిచింది. చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలను ముస్కాన్ స్టైల్లో చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. బ్లూ డ్రమ్ అంటే మగాళ్లకు ఒకరకమైన భయం ఏర్పడింది. కేవలం మగాళ్లకు మాత్రమే కాదు..


కొంతమంది ఆడవాళ్లకు కూడా బ్లూ డ్రమ్ భయం పట్టుకుంది. ఓ భర్త తన భార్యను ముస్కాన్ స్టైల్లో చంపి.. డ్రమ్ములో పడేస్తానని భయపెట్టాడు. భార్యను ఎలా చంపాలనుకుంటున్నాడో.. ప్లాన్ మొత్తం ఆమెకే వివరించి చెప్పాడు. తరచుగా భార్యకు ముస్కాన్ వీడియోలు పంపి వార్నింగ్ ఇచ్చేవాడు. దీంతో ఆ భార్య వెన్నులో వణుకు మొదలైంది. భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సౌమయా సలీమ్ అనే యువతికి 2023లో ఫైజల్ అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయిన నాటి నుంచే భర్త ఆమెను వేధించటం మొదలెట్టాడు. ప్రతీరోజు ఆమెపై దాడి చేసేవాడు.


రోజురోజుకు భర్త వేధింపులు పెరిగాయే తప్ప తగ్గలేదు. ముస్కాన్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెకు నరకం మొదలైంది. భర్త తరచుగా ముస్కాన్‌కు సంబంధించిన వీడియోలు ఆమెకు పంపేవాడు. ‘ ముస్కాన్ కేసు ఎందుకూ పనికిరాలేదు. నిన్ను నేను డ్రమ్ములో కుక్కుతాను. దాన్ని ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా పడేస్తాము. నువ్వు కోపిష్టివని, ఇంట్లోంచి పారిపోయావని పోలీసులకు చెబుతాము’ అని అనేవాడు. ఆమెకు తెలియకుండా పర్సనల్ ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో కూడా వేధించేవాడు. భర్త వేధింపులు తారా స్థాయికి చేరటంతో ఆమె పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి:

Ayodhya Surya Tilak: అయోధ్యలో నేడు అద్భుత దృశ్య

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు తగ్గుతున్న బంగారం ధరలు

Updated Date - Apr 06 , 2025 | 08:25 AM