పిల్లల లంచ్‌బాక్స్‌లో ఇవి వద్దు...
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:12 AM
పిల్లలకు ఇష్టమని లంచ్‌బాక్స్‌లో రకరకాల చాక్లెట్లు, చిప్స్ పెడుతూ ఉంటారు చాలామంది తల్లులు. వీటి వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు...

పిల్లలకు ఇష్టమని లంచ్‌బాక్స్‌లో రకరకాల చాక్లెట్లు, చిప్స్ పెడుతూ ఉంటారు చాలామంది తల్లులు. వీటి వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల లంచ్‌బాక్స్‌లో ఏవి పెట్టకూడదో తెలుసుకుందాం.
పళ్ల రసాల ప్యాకెట్లు: నిమ్మ, నారింజ, దానిమ్మ లాంటి రకరకాల పళ్ల రసాల ప్యాకెట్లు ప్రస్తుతం బజార్లో దొరుకుతున్నాయి. చాలామంది ఇవి ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో వీటిని కొని పిల్లల లంచ్‌బాక్స్‌లో పెట్టేస్తుంటారు. వీటిలో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటాయి. ఎక్కువకాలం నిల్వ ఉండడం కోసం రసాయనాలు కూడా కలుపుతుంటారు. వీటివల్ల పిల్లల్లో స్థూల కాయం, దంత సమస్యలు ఏర్పడవచ్చు. ఇలాంటి పాకెట్లను లంచ్‌బాక్స్‌లో పెట్టకూడదు.
డ్రైఫ్రూట్ చాక్లెట్లు: కాజు, బాదం, పిస్తా లాంటి నట్స్, డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటితో తయారు చేసిన చాక్లెట్లలో కృత్రిమ రంగులు, అధిక పరిమాణంలో చక్కెర, ఇతర కొవ్వు పదార్థాలు కూడా కలుపుతారు. వీటిని తినడం వల్ల పిల్లలకు జీర్ణ సమస్యలు వస్తాయి. తరచూ ఇలాంటి చాక్లెట్లని పిల్లలకు ఇవ్వకూడదు.
సాల్ట్ బిస్కెట్స్, చిప్స్: వీటిలో పిల్లలకు అవసరమైనదానికంటే ఎక్కువ పరిమాణంలో ఉప్పు ఉంటుంది. వీటిని తిన డం వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుంది.
పేస్ట్రీలు, రస్క్‌లు: వీటిని సాధారణంగా మైదాతో తయారు చేస్తూ ఉంటారు. ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో కూడా అధికంగా చక్కెర, కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటివల్ల పిల్లలకు మధుమేహం లాంటి సమస్యలు రావచ్చు.
పిజ్జా, బర్గర్: వీటిలో పోషకాలకు బదులు అధిక మొత్తంలో క్యాలరీలు, శాచురేటెడ్ కొవ్వులు, సోడియం లాంటివి ఉంటాయి. వీటివల్ల పిల్లలకు టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..