Share News

Silver Anklets Benefits: వెండి పట్టీలతో ప్రయోజనాలెన్నో

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:43 AM

పాదాలకు వెండి పట్టీలు ధరించడం ఒక సంప్రదాయం మాత్రమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగవడం, నాడీ వ్యవస్థ చురుకుదనం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి

Silver Anklets Benefits: వెండి పట్టీలతో ప్రయోజనాలెన్నో

పాదాలకు వెండి పట్టీలు పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఆడపిల్లలు, యువతులు, మధ్యవయసు మహిళలు తమ పాదాల అలంకరణలో వీటికి ప్రత్యేక స్థానం ఇస్తూ ఉంటారు. కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఈ వెండి పట్టీలు దోహదం చేస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం....

  • పాదాలకు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. పాదాల నొప్పి, వాపులు తగ్గుతాయి. ఎముకలు బలపడతాయి. మోకాళ్ల నొప్పి, నడుం నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

  • వెండిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే వెండి పట్టీలు పెట్టుకుంటే పాదాలకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావు.

  • వెండి శీతల లోహం. నిత్యం వెండి పట్టీలు పెట్టుకుని ఉండడం వల్ల మహిళల్లో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరానికి చలువదనం చేకూరుతుంది. వేసవిలో పాదాలు వేడెక్కడం, అరికాళ్లలో చెమటలు పట్టడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

  • వెండి... శరీరంలోని విద్యుత్‌ చలన శక్తిని సమన్వయం చేస్తుంది. అందుకే మహిళలు తమ పాదాలకు వెండి గొలుసులు, పట్టీలు పెట్టుకోవడం వల్ల నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్లు సమతౌల్యంలో పనిచేస్తాయి. రుతు సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

  • రంగురంగుల రాళ్లు, మువ్వలతో విభిన్న ఆకృతుల్లో రూపొందించిన పట్టీలు పెట్టుకోవడం వల్ల మహిళలకు మానసిక ఆనందం కలుగుతుంది.

  • అధిక బరువున్న పట్టీలు కాకుండా తేలికగా ఉన్నవాటిని ధరిస్తే నడవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. నాణ్యమైన వెండితో రూపొందించిన పట్టీలు ఎంచుకోవడం మంచిది.

Updated Date - Apr 14 , 2025 | 12:43 AM