Hair Care: శిరోజాల కుదుళ్లు బలంగా...
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:25 AM
పోషకాహార లోపం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల కుదుళ్లు బలహీనమై శిరోజాలు రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లు బలంగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మాడు మీద చర్మం పొడిబారకుండా చూసుకుంటే కుదుళ్లు బలపడతాయి. ఆముదం, కొబ్బరినూనె, బాదం నూనె, ఆలివ్ నూనెల్లో ఒకదానితో తలంతా మర్దన చేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఆ నూనెని కొద్దిగా వేడిచేసి ఉపయోగించడం వల్ల మాడు మీద రక్తప్రసరణ పెరిగి కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రోటీన్లు, ఇరన్, బయోటిన్ లాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్లు, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పళ్లను ఆహారంలో చేర్చుకుంటే శిరోజాల కుదుళ్లు బలపడతాయి.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News