Share News

Rose Gold Jewelry: గులాబీ మెరుపుల్లో

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:45 AM

గులాబీ రంగులో మెరిసే రోజ్ గోల్డ్ ఆభరణాలు యువతను ఆకట్టుకుంటూ తాజా ఫ్యాషన్‌లో భాగంగా మారాయి. విభిన్న శైలిలో అందుబాటులో ఉన్న ఈ ఆభరణాలు ప్రతి వయస్సులోనూ ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి.

Rose Gold Jewelry: గులాబీ మెరుపుల్లో

గులాబీ రంగులో మెరిసే ‘రోజ్‌ గోల్డ్‌’ ఆభరణాలు సర్వత్రా ఆదరణ పొందుతున్నాయి. నేటి యువతులను విపరీతంగా ఆకట్టుకుంటూ తాజా ఫ్యాషన్‌లో భాగంగా మారిన రోజ్‌ గోల్డ్‌ ఆభరణాలను పరిశీలిద్దామా?

రోజ్‌ గోల్డ్‌ అంటే?

కలిపే మిశ్రమ లోహాల పరిమాణాన్ని బట్టి బంగారం రంగు మారుతూ ఉంటుంది. రోజ్‌ గోల్డ్‌ కోసం బంగారంలో ఎక్కువ శాతం రాగి లోహాన్నీ, కొద్ది పరిమాణంలో వెండినీ కలుపుతారు. ఎంత ఎక్కువ రాగి కలిపితే బంగారం అంత ఎరుపు రంగు సంతరించుకుంటుంది. కాబట్టి బంగారం గులాబీ వర్ణం సంతరించుకునేంత మేరకు రాగిని కలిపి, రోజ్‌ గోల్డ్‌ తయారు చేస్తారు. 18 క్యారెట్ల బంగారంలో 75% బంగారం, 21% రాగి, 4% వెండి ఉంటుంది.

ujh.gif

అయితే...ఈ చిట్కాలు పాటించండి.

రోజ్‌ గోల్డ్‌ స్టడ్‌ ఇయర్‌ రింగ్స్‌ను భారీ సైజు బంగారు జూకాలతో కలిపి ధరించవచ్చు. రెండు బంగారు గాజులు లేదా వెండి గాజుల మధ్య రోజ్‌ గోల్డ్‌తో తయారైన గాజు ఇట్టే ఇమిడిపోతుంది. స్టైల్‌తోపాటు,


ఆభరణాలు ఇలా...

ఆభరణాల్లో రోజ్‌ గోల్డ్‌కు చోటు కల్పించాలంటే ప్రస్తుతం మన దగ్గరున్న వెండి, బంగారు ఆభరణాలతో మ్యాచ్‌ అయ్యే రోజ్‌ గోల్డ్‌ ఆభరణాలు కొనాలి. మిగతా లోహాలతో తయారైన ఆభరణాలతో కలిసిపోవటం రోజ్‌ గోల్డ్‌కి ఉన్న ప్రత్యేకత. అయితే ఎలాంటి ఆభరణాలతో మ్యాచ్‌ చేయాలో అవగాహన లేదా?

కొత్త పోకడకు నాంది అవుతుంది

వైట్‌ గోల్డ్‌ అయిన ప్లాటినంకు కూడా ఆదరణ ఎక్కువే! కాబట్టి రోజ్‌ గోల్డ్‌, ప్లాటినం కలిపి లేయర్డ్‌ జ్యువెలరీగా వాడొచ్చు.

బంగారంతో పోలిస్తే రోజ్‌ గోల్డ్‌ ఖరీదు తక్కువ కాబట్టి భారీ ఆభరణాలు ధరించాల్సిన సందర్భంలో రోజ్‌ జ్యువెలరీని ఎంచుకోవచ్చు.

చెవికి పెద్ద పెద్ద రింగులు లేటెస్ట్‌ ఫ్యాషన్‌. రోజ్‌ గోల్డ్‌తో తయారైన సాదా రింగులు కాకుండా, జడలా అల్లినట్టుండే బ్రెయిడెడ్‌ రింగ్స్‌ ఎంచుకుంటే వినూత్నంగా కనిపిస్తారు.

నగలే కాదు రోజ్‌ గోల్డ్‌తో తయారైన చేతి గడియారాలూ దొరుకుతాయి. వాచీ ధరించే అలవాటున్న వాళ్లు రోజ్‌ గోల్డ్‌ గడియారం కొనుక్కుంటే వేడుకల్లో దాన్నొక ఆభరణంగా ధరించవచ్చు.


ఇవి కూడా చదవండి..

Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు

Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం

For National News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 01:45 AM