Holding Urine Danger: మూత్రవిసర్జన ఆపుకుంటే?
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:03 AM
మూత్రవిసర్జనను నిరంతరం నియంత్రించడం వల్ల మూత్రాశయం మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు రాళ్లు మరియు నొప్పులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది

మీకు తెలుసా?
అత్యవసర సమావేశంలో ఉన్నప్పుడు లేదా వాష్‌రూమ్స్ అందుబాటులో లేనప్పుడు మూత్రవిసర్జనను నియంత్రించుకుంటూ ఉంటాం. అయితే ఇదే అలవాటుగా మారితే మూత్రాశయం, మూత్రపిండాల సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మూత్రవిసర్జనను బలవంతంగా ఆపుకున్నప్పుడు, మూత్రాశయం దాని సహజసిద్ధ సామర్థ్యానికి మించి సాగుతుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే, కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవక, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూత్రాశయ పనితీరు దెబ్బతింటుంది. కొందర్లో మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగిన వాళ్లకు రెట్టింపు ముప్పు పొంచి ఉంటుంది. మూత్రాశయంలో మూత్రం ఎక్కువ సమయం పాటు నిల్వ ఉండిపోయినప్పుడు, మూత్రంలోని బ్యాక్టీరియా విస్తృతి చెందే వాతావరణం నెలకొంటుంది. దాంతో ఇన్‌ఫెక్షన్ పెరిగి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి, పొత్తికడుపు నొప్పి, జ్వరం లాంటివి వేధిస్తాయి. అలాగే మూత్రవిసర్జనను నియంత్రించుకోవడం వల్ల మూత్రపిండాల మీద భారం పెరిగి, వాటి పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి శరీర సంకేతాలకు సకాలంలో స్పందిస్తూ, మూత్రాశయాన్ని ఖాళీ చేస్తూ ఉండాలి. మూత్రవిసర్జనను నియంత్రించుకునే పరిస్థితులకు దూరంగా ఉండాలి. సరిపడా నీళ్లు తాగుతూ, పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి.
ఇవి కూడా చదవండి..