JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు
ABN, Publish Date - Mar 15 , 2025 | 07:59 AM
జనప్రవాహంతో జనసేన సభ పోటెత్తింది. 12వ ఆవిర్భావ సభ వేళ పిఠాపురం ‘జయ కేతనం’ ఎగురవేసింది. తండోపతండాలుగా వచ్చిన జనంతో చిత్రాడలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం కిక్కిరిసింది.
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది.
లక్షలాది మంది జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున చిత్రాడ సభకు తరలి వచ్చారు.
ఒక్కో గ్యాలరీలో 2,500 మంది కూర్చొనేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. గ్యాలరీలన్నీ జనసైనికులతో నిండిపోయాయి.
ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున సభకు తరలి వచ్చారు.
సభకు వచ్చిన జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ వర్గాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి.
సభకు తరలి వచ్చిన జనసేన కార్యకర్తలకు ఇబ్బంది రానీయకుండా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సభలో సందడి చేస్తున్న జనసైనికులు
పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న యువత
పవన్ కల్యాణ్‌కు హారతి ఇస్తున్న వీరాభిమాని
పవన్ కల్యాణ్ కటౌట్‌లతో సందడి చేస్తున్న యువకులు
పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా టపాసులు కాలుస్తున్న జనసైనికులు
Updated Date - Mar 15 , 2025 | 12:05 PM