తిరుపతి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు చంద్రగిరి మండలం, నారావారి పల్లె గ్రామం, నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగా నేపథ్యంలో మంగళవారం ఉదయం నారా వంశీకులు నాగాలమ‌్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిని, దేవాన్ష్, ఎంపీ భరత్ ఆయన సతీమణి తేజస్విని, తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు.