విజయనగరంలో ‘కోర్ట్’ సినీ బృందం సందడి
ABN, Publish Date - Mar 18 , 2025 | 07:46 AM
విజయనగరం: నగరంలోని ఎస్‌వీసీ రంజని, శివరంజని థియేటర్లలో సోమవారం ‘కోర్ట్’ చిత్రం యూనిట్ సందడి చేసింది. వారికి థియేటర్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. యూనిట్ సభ్యులంతా థియేటర్ లోపల కొద్దిసేపు ప్రేక్షకులతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. సినిమాను అమితంగా ఆదరిస్తున్నందుకు డైరెక్టర్ రామ్ జగదీష్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ వద్ద విలేకరులతోనూ మాట్లాడారు. మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. లాయర్‌గా నటించిన ప్రియదర్శి మాట్లాడుతూ, పోక్సో చట్టంలోని లోటుపాట్లను ఆలోచనాత్మకంగా చూపించామన్నారు. హీరో, హీరోయిన్లు రోషన్, శ్రీదేవిలు మాట్లాడుతూ, తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ సాయి, ఇన్‌చార్జి రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరంలోని ఎస్‌వీసీ రంజని, శివరంజని థియేటర్లలో ‘కోర్ట్’ చిత్రం యూనిట్ సందడి..

‘కోర్ట్’ సినిమా హిట్‌తో ఉత్సాహంలో నటుడు ప్రియదర్శి..
‘కోర్ట్’ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం సంతోషంగా ఉందని హీరో రోషన్ వ్యాఖ్యానించారు.
విజయనగరంలో ‘కోర్ట్’ చిత్రం యూనిట్ సందడి.. మాట్లాడుతున్న నటుడు ప్రియదర్శి..
‘కోర్ట్’ సినిమాలో మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ...
‘కోర్ట్’ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ...
ప్రేక్షకులతో సెల్ఫీలు తీసుకున్న నటీనటులు..
Updated Date - Mar 18 , 2025 | 07:46 AM