ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nara Lokesh: మంగళగిరిలో వేడుకగా ఇంటి పట్టాల పంపిణీ

ABN, Publish Date - Apr 05 , 2025 | 11:09 AM

ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వారు నివసిస్తున్న స్థలాలపై శాశ్వత ఇంటి పట్టా అందించే మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటి పట్టాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు.

1/9

ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వారు నివసిస్తున్న స్థలాలపై శాశ్వత ఇంటి పట్టా అందించే మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటి పట్టాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు.

2/9

మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన సభలో యర్రబాలెం, నీరుకొండ గ్రామాలతో పాటు మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 546 పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందించారు.

3/9

అలాగే యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు, నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు

4/9

2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మతిరిగే విధంగా 91వేల ఓట్ల భారీ మెజార్టీతో మంగళగిరి ప్రజలు తనను గెలిపించి శాసనసభకు పంపించారని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.

5/9

రెండున్నర దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు తనను కోరారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

6/9

ప్రజాప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే మొదటి విడతలో 3వేల మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందించానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

7/9

బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కును ప్రజలకు కూటమి ప్రభుత్వం అందజేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

8/9

తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే మంగళగిరిలో చెప్పానని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.

9/9

మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ మాటిచ్చారు.

Updated Date - Apr 05 , 2025 | 11:15 AM