శ్రీకాకుళంజిల్లాలో పదో తరగతి పరీక్షలు..
ABN, Publish Date - Mar 17 , 2025 | 11:42 AM
మార్చి 17 సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదోతరగతి పరీక్షల్లోనూ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తోంది. గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి సైన్స్ మినహా మిగతావన్నీ ఒక్కో పరీక్షకు పరిమితం చేసింది.

మార్చి 17 సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.

శ్రీకాకుళంజిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు..
ఈ నెల 17 నుంచి 31 వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈమేరకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు.
జిల్లాలో 149 కేంద్రాల్లో 29,791 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వీరిలో రెగ్యులర్‌లో బాలురు 14,810 మంది, బాలికలు 14,174 మంది మొత్తం 28,984 మంది ఉన్నారు.
పదోతరగతి పరీక్షల్లోనూ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తోంది.
పోలీసుస్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించేందుకు 37 వాహనాలను అందుబాటులో ఉంచారు.
గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి సైన్స్ మినహా మిగతావన్నీ ఒక్కో పరీక్షకు పరిమితం చేసింది.
Updated Date - Mar 17 , 2025 | 11:43 AM