రాయదుర్గంలో త్రినయ్ హాస్పిటల్ ప్రారంభం.. పాల్గొన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
ABN, Publish Date - Apr 14 , 2025 | 09:58 AM
ఆర్థోపెడిక్ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్ దినేశ్ సుంకర హైదరాబాద్‌లోని రాయదుర్గంలో త్రినయ్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు. అలాగే ఇదే భవనంలో డాక్టర్ పీ. లక్ష్మీ మౌనిక, డాక్టర్ సుస్మిత రెడ్డి ఆధ్వర్యంలో హెయిర్, స్కిన్, సౌందర్య చికిత్స అందించేందుకు ప్రపంచ స్థాయి సాంకేతికతతో, ఆధునిక యంత్ర పరికరాలతో సీరం లక్స్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సినీ దర్శకులు రాఘవేందర్ రావు , బోయపాటి శ్రీను, నటులు రాజేంద్రప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఆర్థోపెడిక్ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్ దినేశ్ సుంకర హైదరాబాద్‌లోని రాయదుర్గంలో త్రినయ్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు.

అలాగే ఇదే భవనంలో డాక్టర్ పీ. లక్ష్మీ మౌనిక, డాక్టర్ సుస్మిత రెడ్డి ఆధ్వర్యంలో హెయిర్, స్కిన్, సౌందర్య చికిత్స అందించేందుకు ప్రపంచ స్థాయి సాంకేతికతతో, ఆధునిక యంత్ర పరికరాలతో సీరం లక్స్ ఆస్పత్రిని ప్రారంభించారు.

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ, తదితరులు

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటులు రాజేంద్రప్రసాద్, తదితరులు

ఈ కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సినీ దర్శకులు రాఘవేందర్ రావు , బోయపాటి శ్రీను, నటులు రాజేంద్రప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. ఈ ఆస్పత్రులు ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకొచ్చిన డాక్టర్లను మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభినందించారు.

కార్యక్రమంలో నటులు రాజేంద్ర ప్రసాద్‌తో మాట్లాడుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, సినీ నటులు రాజేంద్రప్రసాద్, దర్శకులు రాఘవేందర్ రావు, బోయపాటి శ్రీను

ఆస్పత్రిలో వైద్య పరికరాలను పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరులు

కార్యక్రమంలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ, తదితరులు
Updated at - Apr 14 , 2025 | 10:28 AM