Sleeping Timings: రోజూ ఆలస్యంగా పడుకుంటున్నారా.. మీ శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే..
ABN, Publish Date - Apr 01 , 2025 | 07:03 AM
ప్రస్తుతం చాలా మంది యువత రోజూ ఆలస్యంగా పడుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం చాలా మంది యువత రోజూ ఆలస్యంగా పడుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఎక్కువగా ఫోన్లు చూసుకుంటూ అర్ధరాత్రి వరకూ మేల్కొంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నష్టాలంటే ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ అర్ధరాత్రి 12, 1 గంట వరకూ మేల్కోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందట. సమయానికి పడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆలస్యంగా పడుకోవడం వల్ల అలసట, నీరసం రావడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

అర్ధరాత్రి వరకూ మేల్కోవడం వల్ల శరీరంలో జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.

రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మేల్కోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

బరువు పెరగడంతో పాటూ చిరాకు, కళ్ల మచ్చలు, మొటిమలు తదితర సమస్యలు మొదలవుతాయి.

రాత్రి 10 లోపే నిద్రపోవడానికి ప్రయత్నించాలి. నిద్రపోవడానికి అర్ధగంట ముందే ఫోన్లు, టీవీలను ఆఫ్ చేయాలి. దీనికి తోడు నిద్రపోయే ప్రదేశం నిశ్శబ్దంగా ఉండడంతో పాటూ తక్కువ వెలుతురులో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Updated at - Apr 01 , 2025 | 07:03 AM