Pineapple: వేసవిలో రోజూ పైనాపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - Apr 08 , 2025 | 07:09 AM
పైనాపిల్లోని అనేక పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. వేసవిలో రోజూ పైనాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్లోని బ్రోమెలైన్ అనేఎంజైమ్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.

పైనాపిల్‌ను తరచూ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకూ ఇది సహకరిస్తుంది.

పైనాపిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వేడిని తగ్గించడంలో సాయం చేస్తాయి. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

పైనాపిల్‌ను తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

పైనాపిల్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో పైనాపిల్ సాయం చేస్తుంది.
Updated at - Apr 08 , 2025 | 07:09 AM