Share News

Shocking: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడా చూడలేదే.. మేనేజర్ పెద్ద పాత్రలో కూర్చున్నాడేంటి? ఎందుకంటే..

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:15 PM

ఎవరు ఏ విచిత్రమైన దానిని చూసినా, తమకేది స్పెషల్‌గా అనిపించినా వెంటనే, దానిని తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. దాంతో అది సోషల్ మీడియా జనాలందరి దృష్టిని ఆకర్షించి వైరల్ అయిపోతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ విచిత్రమైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shocking: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడా చూడలేదే.. మేనేజర్ పెద్ద పాత్రలో కూర్చున్నాడేంటి? ఎందుకంటే..
funny viral photo

ఈ ప్రపంచంలోని వింతలన్నీ సోషల్ మీడియా ప్రజల దృష్టికి రావాల్సిందే. ఎవరు ఏ విచిత్రమైన దానిని చూసినా, తమకేది స్పెషల్‌గా అనిపించినా వెంటనే, దానిని తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. దాంతో అది సోషల్ మీడియా జనాలందరి దృష్టిని ఆకర్షించి వైరల్ అయిపోతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ విచిత్రమైన ఫొటో (Viral Photo) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన వారందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే ఇంతకుముందెప్పుడూ అలాంటిది చూసి ఉండరు (Viral News).


@VishalMalvi అనే ట్విటర్ యూజర్ ఆ ఫొటోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చుని తన పని చేసుకుంటున్నారు. అయితే ఆ వ్యక్తి సీట్, కంప్యూటర్ టేబుల్‌ను ఓ పెద్ద పాత్రలో (Vessel) పెట్టారు. ఆ పాత్ర చుట్టూ కొందరు నిలబడి పని చేసుకుంటున్నారు. ఆ పాత్ర కింద ఓ స్టవ్ లాంటిది కూడా కనబడుతోంది. మంట వెలుగుతున్నట్టు లైటింగ్ కూడా వస్తోంది. అది చూడడానికి ఆశ్చర్యంగా ఉంది. నిజానికి అది ఓ రెస్టారెంట్. బిర్యానీ తయారు చేసే పాత్రలాంటి సెట్టింగ్ వేసి దానిలో క్యాషియర్‌ను కూర్చోబెట్టారు.


ఈ క్రియేటివిటీ చాలా మందికి నచ్చింది. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. దానిని ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోను వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు. ``అది పాలక్ పన్నీర్ రెస్టారెంట్``, ``అదిరిపోయే క్రియేటివిటీ``, ``సృజనాత్మకతకు హద్దులు ఉండవు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Husband and wife: ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? భర్తకు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా?


Optical Illusion: జింక ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. వేటగాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి..


Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..


Optical Illusion: ఈ ఫొటోలో మీకు గుర్రం కనబడితే.. మీరు సాధారణమైన వ్యక్తి కాదు.. ప్రయత్నించండి..


Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2025 | 05:15 PM