Parle G Girl To Amul Girl: ఏఐ అద్భుతం.. ఆ ఇద్దరు పాపలకు ప్రాణం పోసింది..
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:02 PM
Parle G Girl To Amul Girl: నైంటీస్ కిడ్స్‌కు ఎంతో ఇష్టమైన అమూల్ పాప, పార్లేజీ పాపల ఫొటోలకు ఏఐ ప్రాణం పోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతాలను సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో తన సత్తా ఏంటో చూపిస్తోంది. ఆఖరికి మనుషుల ప్రాణాలను రక్షించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇక, ఫొటోలకు ప్రాణం పోవటంలోనూ ఏఐకి సాటిలేకుండా పోతోంది. సాధారణ ఫొటోలను కూడా కదిలే బొమ్మల వీడియోగా మారుస్తోంది. జనాలు తమకు ఇష్టమైన వాళ్ల ఫొటోలను ఏఐ ద్వారా కదిలే బొమ్మలుగా మార్చి సంతోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నైంటీస్ కిడ్స్‌కు ఎంతో ఇష్టమైన పార్లేజీ, అమూల్ పాపలకు కూడా ఏఐ ప్రాణం పోసింది. షాహిద్ ఎస్కే అనే వ్యక్తి తన మార్కెటింగ్ ఏజెన్సీ ప్రమోషన్ కోసం అమూల్, పార్లేజీతో పాటు మరికొన్ని ఫొటోలను వీడియోలుగా మార్చాడు.
వాటిని ఓ వీడియో కింద మార్చి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకుంది. లక్షల్లో లైకులు వచ్చాయి. ఆ వీడియోను చూస్తుంటే పాత జ్ణాపకాలు మొత్తం గుర్తుకు వస్తున్నాయి. అమూల్,పార్లేజీ పాపలకు ప్రాణం వస్తే అచ్చం అలాగే ఉంటుందా? అన్నట్లుగా ఏఐ వాటికి ప్రాణం పోసింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు తమ పాత జ్ణపకాలను నెమరువేసుకుంటున్నారు. షాహిద్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి, ఈ ఏఐ అద్భుతాలపై మీరేమనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2025: యూపీఐ కంపెనీలకు ఐపీఎల్ సవాల్.. ఇదెక్కడి టెన్షన్ రా బాబు
Breaking News: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల