Aishwarya Rai: ఐశ్వర్య బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా..
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:28 PM
Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ అంటే మాజీ ప్రపంచ సుందరి. ఒకనాటి హీరోయిన్. ఆమె ఒకరికి తల్లి అయినా.. ఆమె అందం మాత్రం చెక్కు చెదరలేదు. అలాంటి ఐశ్వర్యరాయ్.. విదేశాలకు, సినిమా షూటింగ్, వివిధ కార్యక్రమాలకు వెళ్లినా.. ఆమె వెంట ఎవరో వరకు ఉండాల్సి ఉంటుంది.

ఎవరైనా సెక్యూరిటీకి ఎంత జీతం ఇస్తారు. నెలకు రూ. 20 వేలు లేదా రూ. 30 వేలు. మహా అయితే రూ. 50 వేలు వరకు ఇస్తారు. అదే సెలబ్రిటీస్‌కి సెక్యూరిటీగా ఉంటే మాత్రం వారికి ఈ అమౌంట్ కాస్తా ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. అంటే నెలకు రూ.లక్ష లేకుంటే రూ. లక్షన్నర అది కూడా కుకుంటే.. రూ. 2 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు. అయితే మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ సెక్యూరిటీగా ఎల్లప్పుడు ఆమె వెన్నంటే ఉండే బాడీ గార్డ్ శివరాజ్‌కు చెల్లిస్తున్న జీతం ఎంతో తెలుసా?. అతగాడి నెల జీతం తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే.
ఇతగాడి జీతం సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో కంటే అధికంగా ఉంటుందంటే మనలో ఎవరైనా నమ్ముతారా? అంటే నమ్మలేరని చెప్పాలి. మాజీ ప్రపంచ సుందరి, ఒకప్పటి హీరోయిన్, బచ్చన్ ఫ్యామిలీలో మెంబర్ ఐశ్వర్య రాయ్. అలాంటి ఆందాల బామకు బాడీగార్డ్‌గా ఉండే వ్యక్తికి ఆ మాత్రం జీతం ఉండాలనే వారు సైతం ఈ లోకంలో లేక పోలేదు. ఇంతకీ ఐశ్వర్యరాయ బాడీగార్డ్ శివరాజ్ జీతం నెలకు ఎంతో తెలుసా?. ఎంతంటే.. నెలకు రూ. 7 లక్షలు. అంటే ఏడాదికి రూ. 84 లక్షలు అతడు జీతంగా ఐశ్వర్య రాయ్ నుంచి అందుకొంటున్నాడు.
అదీకాక ఐశ్వర్యరాయ్ అంటేనే ఓ క్రేజ్. సినీ ప్రముఖుల చుట్టూ నిత్యం సందడి సందడిగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్ బయటకు వెళ్లినప్పుడు అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉంటారో ఎవరికి చెప్పనవసరం లేదు. అందుకే వారి భద్రత కోసం అత్యంత నమ్మకమైన వ్యక్తి ప్లస్ వ్యక్తిగత అంగరక్షకుడు శివరాజ్ ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తాడనే ఓ చర్చ సైతం బాలీవుడ్‌లో బలంగా ఉంది.
ఇక సినిమా షూటింగ్ అయినా.. ఏదైనా ఈవెంట్ అయినా.. లేదా ఐశ్వర్య రాయ్ విదేశాలకు వెళ్ళినా.. బాడీ గార్డ్‌గా ఆమె పక్కనే శివరాజ్ ఉంటాడంటారు. ఇక శివరాజ్.. బచ్చన్ కుటుంబానికి అతడు ఎంత దగ్గరయ్యారంటే.. 2015లో అతడు వివాహమైంది. అతడి వివాహానికి బ్యూటీ ఐశ్వర్యరాయ్ స్వయంగా హాజరయ్యారు. దీంతో శివరాజ్‌కు బచ్చన్ ఫ్యామిలీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీనిని బట్టి అర్థమవుతోంది.
శివరాజ్ జీతానికి సంబంధించిన ప్యాకేజీ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి జీతం చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. అతడికి అంత జీతమా అని వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ జీతం బహుళ జాతి కంపెనీల సీఈఓల కంటే అధికమనే ఓ చర్చ సైతం నెట్టింట చుట్టేస్తోంది.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..