Asim Riaz vs Rajat Dalal: రియాల్టీ టీవీ స్టార్ల బాహాబాహీ.. అవాక్కైన మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:43 PM
ఓటీటీ షో ప్రమోషన్‌లో భాగంగా ఇద్దరు రియాల్టీ టీవీ స్టార్లు మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ముందే బాహాబాహీకి దిగిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ప్రమోషన్ల కోసం ఇలా నాటకానికి తెరతీశారని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ సమక్షంలోనే ఇద్దరు రియాల్టీ టీవీ స్టార్లు బాహాబాహీకి దిగిన షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో..ఒకరినొకరు కొట్టుకునేంత వరకూ వివాదం ఎలా ముదిరిందో అర్థంకాక నెటిజన్లు నెత్తి పట్టుకుంటున్నారు. కొందరు మాత్రం ఇదంతా ఫేక్ అని తేల్చి పారేశారు.
అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌పై రిలీజ్ అయిన బాటిల్ గ్రౌండ్ షో ప్రమోషన్ కోసం ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. కార్యక్రమంలో బిగ్‌బాస్ 13 ఫేమ్ అసీమ్ రియాజ్, మరో రియాల్టీ షో స్టార్ రజత్ దలాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు శిఖర్ ధవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ బాస్ 18 విన్నర్ రుబీనా దిలాయక్ కూడా ఈవెంట్‌కు వచ్చారు.
Also Read: భూప్రకంపనలకు షాక్.. 40వ అంతస్తు నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..
అయితే, ఉన్నట్టుండి రజత్ దలాల్, ఆసిమ్ రియాజ్ మధ్య గొడవ మొదలైంది. ఒక్కసారిగా ఇద్దరూ తీవ్రంగా ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. ఆ తరువాత లేచి నిలబడి ఒకరిమీదకు మరొకరు వచ్చారు. తోసుకున్నారు. ఇద్దరు ఒకరిపై మరొకరు చేయిచేసుకునే వరకూ వెళుతుండటం చూసి శిఖర్ ధవన్ కూడా క్షణకాలం పాటు ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకుని ఇద్దరినీ అడ్డుకున్నాడు. లైట్ తీసుకో బ్రో అంటూ వారిని శాంత పరిచే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న రుబీనాకు కూడా ఆశ్చర్యంగా ఫీలయ్యారు. తోటి కళాకారులు ఇలా తన్నులాటకు దిగడం ఆమెకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది.
Also Read: సిజేరియన్ ఆపరేషన్.. 17 ఏళ్ల తరువాత మహిళ కడుపులో కత్తెర తొలగింపు
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా జనాలు మాత్రం లైట్ తీసుకున్నారు. షో ప్రమోషన్ కోసం ఇదంతా చేసుకుంటారని కామెంట్ చేశారు ‘‘అంతా స్క్రి్ప్ట్ ప్రకారమే చేసినట్టు ఉంది. షో కోసం ఇదంతా చేస్తున్నారు’’ అని ఓ వ్యక్తి కుండబద్దలు కొట్టారు.
అయితే, వివాదాస్పదుడిగా పేరున్న అసీమ్ రియాజ్‌కు మాత్రం ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. గతేడాది ఖత్రోంకా ఖిలాడీ షోలో కూడా హోస్ట్, ప్రముఖ డైరెక్టర్ రోహిథ్ శెట్టితో వివాదానికి దిగాడు. అయితే, టాస్క్ సందర్భంగా రోహిత్, తోటి కంటెస్టెంట్‌లతో తప్పుగా ప్రవర్తించినందుకు అతడిని షో నుంచి తొలగించారు. టాస్క్‌కు సంబంధించి రూల్స్ ఫాలో కాకుండా రోహిత్‌తో గొడవకు దిగి చివరకు షో నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.