Viral Video: అంకుల్ చెప్పింది వినాలిగా ఆంటీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:59 PM
ప్రస్తుతం మహిళలు రెళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం పురుషులతో సమానంగా అమ్మాయిలు, పెద్ద వయసు మహిళలు కూడా బైక్‌లు, స్కూటీలు నడుపుతున్నారు. ప్రస్తుతం మహిళలు రెళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు (Women Bike driving). సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల డ్రైవింగ్‌కు (Driving) సంబంధించి అనేక ఫన్నీ వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.
theghostcamera అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ బైక్ నేర్చుకుంటోంది. హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద కూర్చుని స్టార్ చేసింది. ఆ బైక్‌ను ఎలా నడపాలో పక్కనే ఉన్న వ్యక్తి సూచనలు ఇస్తున్నాడు. అతడి సూచనల మేరకు ఆమె బైక్‌ను స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది. యూటర్న్ కూడా తీసుకుంది. అయితే రోడ్డు మీద ఎదురుగా వస్తున్న వాహనాలను ఆమె పట్టించుకోవడం లేదు. ఆ రోడ్డు మీద ఓ బైక్ వేగంగా వస్తోంది. దీంతో ఆమె భర్త ``బ్రేక్‌లు వెయ్.. బ్రేక్‌లు వెయ్`` అని గట్టిగా అరుస్తున్నాడు. అయితే ఆ మహిళ బ్రేక్ వేయకుండా ముందుకు వెళ్లిపోయింది.
ఆ రోడ్డు మీద వేగంగా వచ్చిన బైక్ ఆ మహిళ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ బైక్ మీద నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. భర్త మాట వినకపోవడం వల్ల ఇబ్బంది పడింది``, ``అలాంటి సమయాల్లో అయిన భర్త మాట వినాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ మనుషుల మధ్యన పిల్లిని కనిపెడితే.. మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మాల్సిందే..
Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..
Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి